Smartphones: ఫిబ్రవరిలో మార్కెట్ లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నెలలో
- By Nakshatra Published Date - 07:00 AM, Tue - 31 January 23

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే పదుల సంఖ్యలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నప్పటికీ మొబైల్ తయారీ సంస్థలు మరిన్ని ఫీచర్ లతో తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే మరి ఫిబ్రవరి నెలలో మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వన్‌ప్లస్ 11 5జీ.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 7న మార్కెట్లోకి విడుదల కానుంది. కాగా ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. 6.7 అంగుళాల ఈ4 LTPO 3.0 ఓఎల్ఈడీ డిస్‍ప్లే, క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 5000mAh బ్యాటరీ సామర్థ్యం ను కూడా కలిగి ఉండనుంది.
మరో స్మార్ట్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్. ఈ స్మార్ట్‌ఫోన్ టాప్ బ్రాండ్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్‌ను ఫిబ్రవరి 1న భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సిరీస్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్, ఎస్ 23 అల్ట్రా వంటి మూడు వేరియంట్స్ లో లభించునుంది. హై ఎండ్ రేంజ్‌లో వస్తున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లే, 256 GB ఇంటర్నల్ మెమరీ, రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 40ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 5,000mAh బ్యాటరీ సామర్థ్యం కూడా కలిగి ఉండనుంది. అలాగే ఫిబ్రవరిలో ఒప్పొ ఫైండ్ N2 పోర్టబుల్ స్మార్ట్‌ఫోన్స్ ఒప్పొ ఫైండ్ N2, ఒప్పొ ఫైండ్ N2 ఫ్లిప్‌ను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఒప్పొ ఫైండ్ N2 ఫ్లిప్‌ను వచ్చే నెలలో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ లు ధర విషయాల గురించి ఇంకా వెల్లడించలేదు. ఫిబ్రవరిలో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ లలో మోటరోలా ఎడ్జ్ 40 ప్రో కూడా ఒకటి. మోటరోలా చెందిన ఈ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బార్సిలోనా వేదికగా జరిగే MWC 2023లో లాంచ్ కావచ్చు. గత నెలలో చైనాలో లాంచ్ అయిన మోటో X40 రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా వస్తోంది. కానీ భారత్‌లో మాత్రం ఈ హ్యాండ్‌సెట్ మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. FHD+ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 6.67-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే, 600mAh బ్యాటరీ సామర్థ్యం తో పాటు ఇంకా ఎన్నో అద్భుతమైన స్పెసిఫికేషన్ లతో లభించనుంది. ఐక్యూ Neo 7.. ఐక్యూ నియో7 సిరీస్ ఫిబ్రవరి 16న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో ఐకూ నియో 7, 7ఎస్ఈ, 7 రేసింగ్ వంటి మూడు మోడల్స్ ఉండనున్నాయి. ఐక్యూ నియో 7 లో ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఐక్యూ నియో 7 ఎస్ఈలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది.

Related News

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం