Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.
- Author : Pasha
Date : 23-04-2024 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త. ఉచితంగా డిస్ప్లే రీప్లేస్మెంట్ చేస్తామని శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదండోయ్ !! షరతులు వర్తిస్తాయి !!గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న గెలాక్సీ ఫోన్ యూజర్లకు మాత్రమే ఫ్రీగా డిస్ప్లే రీప్లేస్మెంట్ చేస్తారు. ఆ మోడల్‌కు చెందిన ఫోన్లను వాడేవారు ఈ ఆఫర్‌ను ఏప్రిల్ 30 వరకు వాడుకోవచ్చు. ఇది వన్ టైమ్ ఆఫరే అని శాంసంగ్ కంపెనీ స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్21, గెల్సాకీ నోట్ 20, గెలాక్సీ 22 మోడళ్లలో గ్రీన్ లైన్ సమస్య ఉంది. వాటిలో ఉచితంగా డిస్ప్లేలను రీప్లేస్ చేస్తారు. గత మూడేళ్లలోగా గెలాక్సీ ఫోన్లు కొన్నవారికి మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో చాలా సార్లు గ్రీన్ లైన్ ఇష్యూ తలెత్తింది. దీంతో యూజర్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫోన్లలోనూ యూజర్లకు అదే ప్రాబ్లమ్ ఎదురైంది. దీంతో శాంసంగ్ కంపెనీకి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Also Read : MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. బెయిల్ వస్తుందా ?
తమ యూజర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఫ్రీగా డిస్ప్లే రీప్లేస్మెంట్(Free Screen Replacement) చేయాలని శాంసంగ్ కంపెనీ డిసైడ్ అయ్యింది. ఈ ఆఫర్‌ను పొందడానికి వారెంటీ అక్కర్లేదు. ఫోన్ వారెంటీ డేట్ పూర్తయిన వాళ్లు కూడా ఫ్రీగానే స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. ఇందుకోసం ఆయా ఫోన్ల యూజర్లు ఏప్రిల్ 30లోగా సమీపంలోని శాంసంగ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. శాంసంగ్ కంపెనీ ఆయా ఫోన్లకు ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్మెంటు సైతం చేయనుందట. ఈ ఆఫర్ నేపథ్యంలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది. ఇతర ఫోన్ల మోడళ్లలో గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న వారి కోసం శాంసంగ్ ఏమీ చేయదా ? అని పలువురు యూజర్లు అడుగుతున్నారు.