Reliance JioBook 2023 : జియో మరో సంచలనం.. లేటెస్ట్ లాప్‌టాప్ ధర ఎంతంటే?
గతేడాది అక్టోబరులో 'జియో బుక్' ల్యాప్‌టాప్ విడుదల చేసిన ఈ కంపెనీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో జియో బుక్ తీసుకొచ్చారు. ఫస్ట్ వెర్షన్‌తో పోలిస్తే దీని డిజైన్, పనితీరు మరింత మెరుగ్గా ఉండబోతోంది.
- Author : News Desk
Date : 31-07-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
రిలయన్స్ జియో(Reliance Jio) మరో కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. అదే ‘రిలయన్స్ జియో బుక్’ (Reliance Jio Book) సెకండ్ వెర్షన్. దీనిని ఈ రోజు భారత్ మార్కెట్లో లాంచ్ చేశారు. బ్లూ కలర్ లో వచ్చిన ఈ లాప్టాప్ ను దేశంలో ఫస్ట్ లెర్నింగ్ బుక్ ( first learning book)గా చెబుతోంది జియో. దీని ధర ఎంత, ఫస్ట్ వెర్షన్‌తో పోలిస్తే ఇందులో ఉన్న అదనపు ఫీచర్లు ఏంటో చూద్దామా.
దేశీయ టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక సంచలనం సృష్టించిన సంస్థ రిలయన్స్ జియో. ప్రారంభంలో ఫ్రీగా సిమ్, టాక్ టైమ్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి అందరికీ దగ్గరైంది. గతేడాది అక్టోబరులో ‘జియో బుక్’ ల్యాప్‌టాప్ విడుదల చేసిన ఈ కంపెనీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో జియో బుక్ తీసుకొచ్చారు. ఫస్ట్ వెర్షన్‌తో పోలిస్తే దీని డిజైన్, పనితీరు మరింత మెరుగ్గా ఉండబోతోంది.
ఈ ల్యాప్‌టాప్‌ను మంచి కాంపాక్ట్ డిజైన్‌తో పాటు 4జీ ఇంటర్నెట్ యాక్సెస్ కనెక్టివిటీతో తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్ 11.6-అంగుళాల HD (768X1,366 పిక్సెల్‌లు) డిస్‌ప్లే కలిగి ఉంది. ఆక్టా-కోర్ MediaTek MT8788 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ బేస్ ఉన్న JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. జియో బుక్ ఫస్ట్ వెర్షన్ బరువు 1.20 కేజీలు కాగా.. సెకండ్ వెర్షన్‌ను 990 గ్రాములు మాత్రమే. దీనిలో 4,000mAh బ్యాటరీ అందించారు. అంటే
ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 8 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అలాగే దీనిలో జియోమీట్, జియోక్లౌడ్, జియో సెక్యురిటీ లాంటి ఇన్‌బిల్ట్ యాప్స్ కూడా ఉన్నాయి.
ఈ జియోబుక్ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా ఉంటుందని.. ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీ, గేమింగ్‌లను సపోర్ట్ చేస్తుందని రిలయన్స్ జియో తెలిపింది. ఇది 4GB RAM, 64GB మెమరీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు మెమరీని పెంచుకోవచ్చు. 2-మెగాపిక్సెల్ వెబ్ కెమెరా కూడా ఉంది. దీనిలో Wi-Fi తో పాటు, 4జీ సిమ్ కార్డు, బ్లూటూత్ 5, HDMI మినీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఎంపికలను అందించారు.
రిలయన్స్ యొక్క తాజా జియోబుక్‌ను కంపెనీ ప్రారంభ ధర రూ. 16,499గా ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్, అమెజాన్, ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది ఆగస్టు 5 నుండి నేరుగా అమ్మకానికి వస్తుంది. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.1,250 తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
Also Read : Moto G13: మోటోరోలా ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?