Realme Coca Cola Edition: కోకాకోలా డిజైన్ తో రియల్ మీ ఫోన్ విడుదల!
‘రియల్ మీ 10 ప్రో కోకకోలా ఎడిషన్’ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత (India) మార్కెట్లోకి విడుదల చేసింది.
- Author : Maheswara Rao Nadella
Date : 11-02-2023 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
‘రియల్ మీ 10 ప్రో కోకకోలా ఎడిషన్’ 5జీ (Realme 10 PRO 5G Coca Cola Edition) స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ చూడ్డానికి కోకకోలా కూల్ డ్రింక్ మాదిరిగా అనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో కోకకోలా బ్రాండింగ్ పేరుతో ఉండడం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి. కోకకోలా, రియల్ మీ సంస్థల భాగస్వామ్యం కింద ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రియల్ మీ 10 ప్రో ఇప్పటికే మార్కెట్లో ఉంది. 6.72 ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, వెనుక భాగంలో 108 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో ఈ ఫోన్ ఉంటుంది. ఫోన్ బాక్స్ లోపల కోకకోలా కార్డ్, ఫోన్ బ్యాక్ కేస్ ఉంటాయి. ఫోన్ బాక్స్ పైనా కోకకోలా డిజైన్ కనిపిస్తుంది. రియల్ మీ 10 ప్రో కోకకోలా ఎడిషన్ (Realme 10 PRO 5G Coca Cola Edition) 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో ఒక్కటే వేరియంట్ గా వచ్చే దీని ధర రూ.20999. రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తోపాటు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో అయితే ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు దీని విక్రయాలు మొదలు అవుతాయి.
Also Read: ఫోన్‌లో మాట్లాడుతుంటే అమ్మాయిని! అనుమానంతో పై నుంచి కిందికి తోసేసిన తండ్రి