HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Profile Song According To Our Mood Instagrams Latest Feature How To Set It

Profile Song : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రొఫైల్ సాంగ్’ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి

ఇంతకుముందు వరకు మనం ప్రొఫైల్ సెక్షన్‌లో ఫొటో, పేరును పెట్టుకునేవాళ్లం.

  • Author : Pasha Date : 24-08-2024 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Profile Song On Instagram

Profile Song : చాలామంది నిత్యం ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటారు. తీరిక దొరికనప్పుడల్లా దానిలో టైం గడుపుతుంటారు. ఈ తరుణంలో తమ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ (ఫేస్ బుక్) మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ప్రొఫైల్ సాంగ్ ఫీచర్. దీన్ని వాడుకొని ఇన్‌స్టా యూజర్లు తమ ప్రొఫైల్ సెక్షన్‌లో పాటను యాడ్ చేయొచ్చు. ఇంతకుముందు వరకు మనం ప్రొఫైల్ సెక్షన్‌లో ఫొటో, పేరును పెట్టుకునేవాళ్లం. ఇప్పుడు వీటికి అదనంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ సాంగ్(Profile Song)  కూడా యాడ్ అవుతుందన్న మాట.

We’re now on WhatsApp. Click to Join

యూజర్లు తమ మూడ్ ఆధారంగా ప్రొఫైల్ సాంగ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇన్‌స్టా యూజర్లు ప్రొఫైల్ సాంగ్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత.. ప్లే  అనే బటన్‌పై నొక్కాలి. దీంతో అది యాక్టివేట్ అయిపోతుంది.  ఎవరైనా యూజర్ ప్రొఫైల్‌ను చెక్ చేసినప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అయిత ఒకేసారి సాంగ్ ప్లే అవుతుంది. ఆటో ప్లే ఆప్షన్ ఉండదు. తొలి విడతగా కొంతమంది యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. క్రమంగా ఇన్‌స్టా యూజర్లు అందరికీ  దీన్ని అందిస్తారు.  ఈ ఫీచర్ ఒకవేళ మీ ఇన్‌స్టా యాప్‌లో వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే తొలుత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. 

Also Read :4455 Jobs : మరో నాలుగు రోజులే గడువు.. 4,455 జాబ్స్‌కు అప్లై చేసుకోండి

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను తెరిచి, ప్రొఫైల్ ట్యాబ్ నుంచి ‘ఎడిట్ ప్రొఫైల్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ వెంటనే ‘‘మీ ప్రొఫైల్‌కు సంగీతాన్ని జోడించండి’’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం మీరు అప్‌లోడ్ చేయదల్చిన సాంగ్ కోసం సెర్చ్ చేయండి. దాన్ని మీ ప్రొఫైల్‌కు జోడించాలని డిసైడ్ అయ్యాక.. ఆ సాంగ్‌లోని 30సెకన్ల క్లిప్‌ను ఎంపిక చేయండి. అనంతరం దాన్ని ప్రొఫైల్ సాంగ్ సెక్షన్‌లో అప్‌లోడ్ చేయండి. ఈ ఫీచర్ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె అందించిన కొన్ని లైసెన్స్‌డ్‌ సాంగ్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఏదైనా మెసేజ్ లేదా సాంగ్ పెడితే 24 గంటల్లో మాయం అవుతుంది. కానీ ఇన్‌స్టా ప్రొఫైల్ సాంగ్ అనేది యూజర్లు మార్చే వరకు అదే కంటిన్యూ అవుతుంది.

Also Read :Bangladesh – India Border : ఇండియా బార్డర్‌లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జడ్జి అరెస్ట్.. ఏమైంది ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • instagram
  • Instagram Feature
  • Profile Song

Related News

Sriya Reddy

మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన‌ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన

  • Instagram

    Instagram : ఇన్‌స్టాగ్రామ్..టీనేజ్ యువతను ప్రమాదంలో పడేస్తుందా ? మెటా నివేదికల్లో సంచలన విషయాలు !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd