Poco X6 Neo: పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎ
- By Nakshatra Published Date - 07:22 PM, Mon - 11 March 24
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది పోకో సంస్థ.
మరి ఆ వివరాల్లోకి వెళితే.. పోకో ఎక్స్6 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను ఇండియాలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లూ కలర్ ఆప్షన్లో అందించనున్నారు. రెక్ట్యాంగులర్ రేర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో రెండు కెమెరా సెన్సర్లను ఇవ్వనున్నారు. ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ల 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు.
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 8 జీబీ ర్యామ్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్లో రెండు స్టోరేజ్ వేరియంట్స్‌ను ఇవ్వనున్నారు. ఫోన్ ధర రూ. 18 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.