OnePlus 12: మార్కెట్లోకి కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికి మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.
- By Nakshatra Published Date - 07:50 PM, Mon - 26 June 23
ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికి మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తోంది ఈ కంపెనీ. ఈ నేపథ్యంలోనే వన్‌ప్లస్ సంస్థ మరొక ఫోను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యింది. వన్‌ప్లస్ సంస్థ తాజాగా ప్రీమియం స్టార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ 12 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు.
వన్‌ప్లస్ 11కి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2కే రిజొల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. డిసెంబర్లో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియం రేంజ్లో తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ. 60 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 9-సిరీస్ ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 64-మెగా పిక్సెల్ ఓమ్ని విజన్ ఓవీ 64బీ పెరిస్కోప్ లెన్స్‌తో కెమెరాను డిజైన్ చేశారు.
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్లో 150 వాట్స్ వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. అయితే ఈ ఫోన్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ఉండనున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు కూడా కేవలం బడ్జెట్ ఫోన్ లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చిన వన్ ప్లస్ సంస్థ. ఇకమీదట ప్రీమియం స్మార్ట్ ఫోన్లను కూడా తీసుకురానుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.