Oneplus: త్వరలోనే వన్ ప్లస్ మడత ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పూర్తిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి
- By Anshu Published Date - 02:21 PM, Tue - 16 August 22

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పూర్తిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు మూడు ఆండ్రాయిడ్ ఫోన్ లే కనిపిస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ రాని వాళ్లు కూడా మొబైల్ ని వినియోగించాలి అని ఆసక్తిని కనపరుస్తున్నారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ల కొనుగోలు శాతం కూడా పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే స్మార్ట్ ఫోన్ ల ట్రెండ్ మారిపోయింది. గత ఏడాది వరకు సింగిల్ స్క్రీన్ వైపు మొగ్గు చూపిన యూజర్లు క్రమక్రమంగా మడత పెట్టే ఫోన్లపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక వినియోగదారులను ఇష్ట ఇష్టాలను దృష్టిలో ఉంచుకున్న స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా మడత ఫోన్లను పాకెట్ లోకి తీసుకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అయిన శాంసంగ్, షావోమి, మోటోరోలా కంపెనీలు కొత్త మడత ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసింది. ఇది ఇలా ఉంటే తాజాగా వన్‌ప్లస్ కూడా కొత్త మడత మోడల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు పీట్ లా మడత ఫోన్ మెకానిజమ్ కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. దీని ప్రకారం వన్‌ప్లస్ మడత ఫోన్ రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట తెలిపారు.
వన్‌ప్లస్ మడత ఫోన్ ఫోటోను షేర్ చేస్తూ ఫోల్డింగ్ ఫోన్‌లో మీరు ఎలాంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోల్డింగ్ టెక్నాలజీని చేరుకోవడానికి మాకు ఎన్నో ఏళ్ల సమయం పట్టింది. ఈ కొత్త మెకానిజమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటూ పీట్ లా ట్వీట్ చేశారు. కొత్తగా తీసుకొస్తున్న మడత ఫోన్‌లో యూజర్ కోరుకున్నట్లు పెద్ద డిస్‌ప్లేతోపాటు, ఫోన్‌ను ట్యాబ్‌లాగా ఉపయోగించుకోవచ్చట. అయితే గతే ఏడాది ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలు విలీనం అయిన సంగతి తెలిసిందే. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో మడతఫోన్‌ను విడుదల చేసింది. పీట్ లా ప్రకటనతో టెక్ యూజర్లు వనప్లస్ ఫోల్డింగ్ ఫోన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫోన్ కోసం చాలామంది వినియోగదారులు ఎదురు చూడటం గల కారణం ఇతర మొబైల్ మాదిరిగా రెండు మడతలు కాకుండా మూడు మడతలతో ఈ ఫోను వస్తుండడంతో ఫోన్ పై అంచనాలు మరింత పెరిగాయి.