Nothing Phone 2a: త్వరలోనే మార్కెట్లోకి రోబోతున్న నథింగ్ ఫోన్.. ధర, ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు
- By Anshu Published Date - 03:35 PM, Fri - 22 December 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లో పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది నథింగ్ సంస్థ. మరి ఆ స్మార్ట్ ఫోన్ ఏది?ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్లు ఏవి అన్న విషయాన్ని వస్తే..
కాగా మార్కెట్ లోకి ఇప్పటివరకు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 లు విడుదల కాగా ఆ స్మార్ట్ ఫోన్ లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నథింగ్ ఫోన్ 2కు కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి 27న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్ కానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ టెస్టింగ్ దశలో ఉందని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
అయితే ఈ ఫోన్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 33,000 ఉంటుందని అంచనా. నథింగ్ ఫోన్ 2ఏలో 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుందట. ఈ ఫోన్ 6.7 ఇంచ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్‌సెట్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కలిగి ఉండనుంది.
అలాగే ఈ నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో ఒకటి 50 ఎంపీ కెమెరా ఉంటుందని టెక్ నిపుణుల అంచనా వేస్తున్నారు. సాధారణ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియరానున్నాయి. నథింగ్ ఫోన్ 2a కాకుండా కంపెనీ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ ‘నథింగ్ ఫోన్ 3’ని ఎంపిక చేసిన ప్రాంతాలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట.