CMF phone 1: అతి తక్కువ ధరకే నథింగ్ కొత్త ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు
- By Anshu Published Date - 12:29 PM, Mon - 10 June 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లో పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది నథింగ్ సంస్థ. సీఎమ్‌ఎఫ్ ఫోన్ 1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
అయితే ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని ట్వీట్ చేశారు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12000 గా ఉంది. కంపెనీ చేసిన ట్వీట్‌ను గమనిస్తే ఈ ఫోన్ ఆరెంజ్ కలర్‌లో లెదర్ ప్యానల్‌తో డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి.
వీటి ప్రకారం ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన 120 హెచ్‌జెడ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు 6 జీబీ ర్యామ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ కానుంది. త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఫీచర్స్ తెలియాల్సి ఉంది.