Smartwatch: అద్భుతమైన లుక్ తో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్.. పూర్తి వివరాలివే?
దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చ
- By Nakshatra Published Date - 07:00 PM, Thu - 6 July 23
దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ వాచ్ కూడా విడుదల అయ్యింది.
ప్రముఖ ఫిట్ నెస్ బ్రాండ్ కల్ట్ డాట్ స్పోర్ట్ ఒక స్మార్ట్ వాచ్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ పేరుతో దీనిని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లో అతి పెద్ద డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లే సైజ్ 2.01 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఇటీవల కాలంలో తక్కువ ధరలోనే స్మార్ట్ వాచ్ కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఫైర్ బోల్ట్, బోట్ వంటి కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాచ్ లను లో బడ్జెట్ లోనే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్ట్ డాట్ స్పోర్ట్ కంపెనీ కూడా తక్కువ ధరలోనే ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ లో 2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్ప్లే సన్నని బెజెల్లతో వస్తుంది.
దీని డిజైన్ యాపిల్ వాచ్‌ని తలపిస్తుంది. 200+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. ఈ సింగిల్-చిప్ బ్లూటూత్ కు మద్దతు ఇస్తుంది. డిజిటల్ మైక్రోఫోన్, స్పీకర్‌తో అనుబంధంగా ఉంటుంది. వన్-ట్యాప్ పెయిరింగ్, క్విక్ యాక్సెస్ డయల్‌ప్యాడ్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. అవసరమైనప్పుడు, 90 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అదనంగా, నీరు, ధూళి నిరోధకత కోసం అధికారిక ఐపీ 67 రేటింగ్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో 100 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను ట్రాక్ చేయవచ్చు.
మీ ప్రోగ్రెస్, మెట్రిక్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు కల్ట్ స్పోర్ట్ వాచ్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఇంకా, మీ ఫిట్నెస్ ప్రయాణం వైపు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, స్మార్ట్‌వాచ్ మూడు నెలల కల్ట్ పాస్ హోమ్‌కి ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది. 1000+ హోమ్ వర్కౌట్ వీడియోలకు యాక్సెస్ ఉంటుంది. దీనిలో బ్లడ్ ప్రెజర్ మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ వంటి మరెన్నో హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ వాస్తవ ధర రూ. 2,499. కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ. 1,599 కే దీనిని కొనుగోలు చేయవచ్చు. దీనిని కల్ట్ డాట్ స్పోర్ట్ వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ స్మార్ట్ మనకు వాచ్ గ్రే, బ్లాక్, బ్లూ వంటి కలర్స్ లో లభించనుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.