Boult Rover Pro: బౌల్ట్ నుంచి మరో స్మార్ట్ వాచ్ రిలీజ్.. ధర, ఫీచర్స్ ఇవే?
దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది
- By Nakshatra Published Date - 08:56 PM, Fri - 14 April 23
దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ వాచ్ కూడా విడుదల అయ్యింది.
కాగా ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌లతో ఎక్కువగా ఆకర్షిస్తున్న బౌల్ట్ కంపెనీ తాజాగా మరో సరి కొత్త స్మార్ట్ వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బౌల్ట్ రోవర్ ప్రో పేరుతో రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్, ధర విషయానికి వస్తే.. ఈ వాచ్ కుడి వైపున రెండు భౌతిక బటన్లతో వృత్తాకార డయల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ వాచ్ ఐపీ 68 సర్టిఫైడ్ వాటర్ డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.2499కు అందుబాటులో ఉంటుంది.
ఆరోగ్య పరంగా బౌల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, ఆడవారి కోసం రుతుచక్రం మానిటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌లో ముఖ్యంగా హైడ్రేషన్, సెడెంటరీ రిమైండర్లు ఉంటాయి. అలాగే 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్ ప్రత్యేకత. బౌల్ట్ రోవర్ ప్రో హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో వస్తుంది. అలాగే అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్లు కూడా ఉంటాయి. క్యూఆర్ కోడ్, నాలుగు అంకెల పిన్ ద్వారా సైన్ ఇన్ చేసే పద్ధతి ఆకట్టుకుంటుంది. అలాగే అంతర్నిర్మిత మినీ గేమ్‌లు, వాతావరణ అప్డేట్స్, స్మార్ట్ నోటిఫికేషన్లు, ఫైండ్ మై ఫోన్, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ అలర్ట్‌లు వంటవి ఈ ఫోన్ ప్రత్యేకతలు ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఓ సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు ఏడు రోజుల వరకూ పని చేస్తుది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.