HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >New Features In Iphone 15 Regular Models

Iphone 15: ఐఫోన్ 15 సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు

  • Author : Maheswara Rao Nadella Date : 26-02-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
iPhone 15
New Features In Iphone 15 Regular Models

యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) గురించిన లీకులు కూడా వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు లీకయ్యాయి.

లీకైన ఫీచర్ల ప్రకారం… ఐఫోన్ 15 (Iphone 15) లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను అందించనున్నారు. డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఈసారి ఈ మోడల్స్‌లో కూడా అందించనున్నారు. 2.5డీ గ్లాస్‌తో కొత్త తరహా డిజైన్ అందించనున్నారు. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఇందులో ఉండనున్నాయి. బయోనిక్ ఏ16 ప్రాసెసర్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ పని చేయనున్నాయి. 6 జీబీ ర్యామ్ అందించనున్నారు. లైట్‌నింగ్ పోర్టు బదులుగా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. ఛార్జింగ్ స్పీడ్ మాత్రం లైట్‌నింగ్ తరహాలోనే ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేస్తే… ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే… వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే… ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో ప్రధాన సెన్సార్‌గా అందించారు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. ఇందులో పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Also Read:  Heart: గుండె సంబంధిత మరణాలు ఇండియాలోనే ఎక్కువగా ఉండటానికి కారణం తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Iphone 15
  • Models
  • New
  • Phone
  • regular
  • technology

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd