WhatsApp: వాట్సాప్ లో స్టే సేఫ్ విత్ వాట్సాప్ స్లోగన్ కొత్త క్యాంపెయిన్?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి
- By Nakshatra Published Date - 07:10 PM, Thu - 13 April 23
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి ఏమాత్రం ప్రమాదం వాటిల్లకుండా అనేక రకాల ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాట్సాప్ సంస్థ ఫీచర్లపై మరింత అవగాహన పెంచడం కోసం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే స్టే సేఫ్ విత్ వాట్సాప్.. అనగా వాట్సాప్ తో భద్రంగా ఉండండి అనే స్లోగన్ తో ప్రత్యేక క్యాంపెయిన్ ను రన్ చేస్తోంది. దాదాపు మూడు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కాలంలో వాట్సాప్ సేఫ్టీ ఫీచర్లపై వినియోగదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా.. బ్లాక్ అండ్ రిపోర్ట్, టూ స్టెప్ వెరిఫికేషన్, ప్రైవసీ అండ్ గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
టూ స్టెప్ వెరిఫికేషన్ : ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ఖాతాలకు అదనపు భద్రతను జోడించినట్లు అవుతుంది. మీ వాట్సాప్ ఖాతాను రీసెట్ చేసేటప్పుడు, ధృవీకరించేటప్పుడు ఆరు అంకెల పిన్ అవసరం అవుతుంది. ఒక వేళ మీ సిమ్ కార్డ్ దొంగిలించబడినప్పుడు లేదా ఫోన్ ట్యాంపర్ చేయబడినప్పుడు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
బ్లాక్ అండ్ రిపోర్ట్: మెటా యాజమాన్యం లోని ఇంస్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు ఖాతాను బ్లాక్ అండ్ రిపోర్ట్ చేయడానికి సులభమైన మార్గాన్ని కూడా అందిస్తుంది. బ్లాక్ చేయబడిన కాంటాక్ట్ లు నంబర్ల నుంచి మీకు కాల్ లేదా సందేశాలు రావు.
ప్రైవసీ సెట్టింగ్‌లు : ఈ ప్రైవసీ సెట్టింగ్స్ లో ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, స్టేటస్ వంటి వాటిని ఎవరు చూడవచ్చు..ఎవరు చూడకూడదు అనేది వినియోగదారులు నియంత్రించగలరు. ప్రతి ఒక్కరూ, కాంటాక్ట్స్ మాత్రమే, సెలెక్టెడ్ కాంటాక్ట్స్ లేదా ఎవరూ చూడకుండా కూడా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మీరు మీ ఆన్లైన్ వివరాలను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే, మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు చూడవచ్చు.
గ్రూప్ సెట్టింగ్స్ : వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని యాడ్ చేయవచ్చో కూడా వినియోగదారులు నిర్ణయించగలుగుతారు. తద్వారా మీ గోప్యత పెరుగుతుంది. మీరు సభ్యులుగా ఉండకూడదనుకునే సమూహాలకు మిమ్మల్ని జోడించకుండా నిరోధించవచ్చు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.