Nausha Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. రూ.35 వేలకే స్కూటర్?
రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుండడంతో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు
- By Anshu Published Date - 05:06 PM, Wed - 30 November 22

రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుండడంతో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఎలక్ట్రిక్ కూటమి కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఒక చక్కటి శుభవార్త. అదేమిటంటే కేవలం 35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసేలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక స్కూటీ తయారు చేసింది.
ఇటీవల పంజాబ్ కు చెందిన నౌషా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఈవీని రూపొందించింది. దీని ధర కేవలం రూ.35 వేలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో వ్యవసాయ బోర్ లలో ఉపయోగించే సబ్ మెర్సిబుల్ బోర్‌వెల్ మోటారును ఉపయోగించారు. పైన భాగాన్ని తొలగించి లోపలి భాగాన్ని ఈ స్కూటర్‌కు ఉపయోగించారు. హబ్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ వంటివి కూడా ఇతర ఈవీల నుంచి తీసుకున్నారు. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడానికి మొదట రూ.40 వేల వరకు ఖర్చు అయిందట. కానీ ఆ తర్వాత దీనిని రూ.35కే తయారు చేశారట.
అయితే దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ స్కూటర్‌కు ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాహనం కొనుగోలు చేసేందుకు అందుబాటులో లేకపోయినా త్వరలో అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశాలు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, ఎల్లో రంగుల్లో లభించనుంది. ఎల్లో రంగు వాహనం ముందు భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉండగా, బ్లాక్ వేరియంట్ లో ఉండవని తెలుస్తోంది.