1 Year 23 Hours : ఒక్క సంవత్సరం 23 గంటలేనట.. ఎక్కడంటే ?
1 రోజు అంటే.. 24 గంటలు(1 Year 23 Hours) ఇది మన భూమి లెక్క.. కానీ సోలార్ సిస్టం అవతల ఉన్న ఒక గ్రహంలో 1 సంవత్సరం 23 గంటలేనట!!
- Author : Pasha
Date : 04-06-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
1 రోజు అంటే.. 24 గంటలు(1 Year 23 Hours)
ఇది మన భూమి లెక్క..
కానీ సోలార్ సిస్టం అవతల ఉన్న ఒక గ్రహంలో 1 సంవత్సరం 23 గంటలేనట!!
ఈవిషయాన్ని NASA యొక్క పవర్ ఫుల్ స్పేస్ టెలిస్కోప్ “జేమ్స్ వెబ్” లేటెస్ట్ గా గుర్తించింది..
WASP-39 b అనే పేరు కలిగిన ఆ గ్రహంపై నీళ్లు కూడా ఉన్నాయట..
దాని సైజు.. అతిపెద్ద గ్రహం బృహస్పతి కంటే 10 రెట్లు ఎక్కువట!!
కొత్త గ్రహం WASP-18b మన భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని వాతావరణంలో నీటి ఆవిరి, వాయువులు ఉన్నాయని గుర్తించారు. అక్కడ ఉష్ణోగ్రతలు మాత్రం మామూలుగా లేవు. WASP-18b పై 2,700 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉందని నాసా అంచనా వేసింది. ఇంతటి వేడి కారణంగా.. WASP-18bపై ఉండే నీరు ఆవిరిగా మారి వాతావరణంలో వ్యాపిస్తోంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా.. ఈ గ్రహం కూడా ఎల్లప్పుడూ సూర్యుడిలాంటి ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోందని నాసా వివరించింది. దీనిపై కార్బన్ డయాక్సైడ్ (CO2) కూడా ఉంది.
Also read : Super Saturn: ఆ నక్షత్రం చుట్టూ 30 వలయాలు.. శనిగ్రహ వలయాల కంటే 200 రెట్లు పెద్దవి!!
వాయువుల ఒత్తిడి కారణంగా WASP-18b గ్రహం.. బృహస్పతి కంటే 30% ఎక్కువగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కానీ దీని బరువు బృహస్పతి బరువులో నాలుగింట ఒక వంతు మాత్రమే. అయితే WASP-18b వ్యాసం బృహస్పతి కంటే 1.3 రెట్లు ఎక్కువ. వాస్తవానికి ఈ గ్రహాన్ని నాసా యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS), హబుల్, స్పిట్జర్ టెలిస్కోప్‌ల సహాయంతో 2009లోనే కనుగొన్నారు. ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో, దానిపై నీటిని కనుగొన్నారు. ఇది బృహస్పతి కంటే 10 రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక సంవత్సరం 23 గంటలకు(1 Year 23 Hours) సమానం.