Motorola Edge 60 Pro: ఇవి కదా ఫీచర్స్ అంటే.. విడుదలకు ముందే ఆకట్టుకుంటున్న మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధం అయ్యింది. విడుదలకు ముందే ఈ ఫోన్ అంచనాలను పెంచేస్తోంది.
- By Anshu Published Date - 04:00 PM, Fri - 14 March 25

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటారోలా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వాటితో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకు వస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ఈ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి.. మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ మీ విడుదల చేయబోతోంది. అయితే ఈ మోటోరోలా ఫోన్ ఇంకా మార్కెట్ లోకి లాంచ్ కాక ముందే భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇప్పటికే కొన్ని ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
మరి ఫీచర్స్, ధర విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 6.79-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేలో కంటెంట్ ను వీక్షించడం అద్భుతంగా అనిపించేలా ఉంటుందట. స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వ్యూ యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 చిప్‌సెట్ అందిస్తోంది. చాలా పవర్‌ఫుల్ ఫోన్ అని చెప్పవచ్చు. అలాగే 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ని కూడా పొందే అవకాశం ఉందట. తద్వారా మల్టీ టాస్కింగ్, గేమింగ్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదట.
కెమెరా విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోటోగ్రఫీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 50ఎంపీ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 60ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుందట. ఈ ఫోన్ 4600mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందట. కొన్ని నిమిషాల్లోనే ఛార్జింగ్ కూడా ఫుల్ అవుతుందట. ఇకపోతే ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.59,990 ఉండవచ్చని అంచనా.