Komaki LY Pro: డ్యూయల్ బ్యాటరీతో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
దేశవ్యాప్తంగానే రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే
- By Nakshatra Published Date - 07:30 AM, Thu - 16 March 23

దేశవ్యాప్తంగానే రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్ ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా ఉంది. ఇందులో కంపెనీ డ్యూయెల్ బ్యాటరీస్‌ను అమర్చింది. ఈ రెండింటినీ రిమూవ్ చేయొచ్చు. అంటే డీటాచబుల్ బ్యాటరీలు అని చెప్పుకోవచ్చు.
డ్యూయెల్ చార్జర్‌తో వీటిని చార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి. ఈ కొత్త డ్యూయెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆన్‌బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, టర్బో మోడ్ అనేవి ఇవి. కోమకి ఎల్‌వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 62 కిలోమీటర్లు. అలాగే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీస్కిడ్ టెక్నాలజీ ఉంది. హిల్స్‌పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇందులో 12 ఇంచుల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.
ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఏకంగా 160 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

Related News

Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు
ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.