Jio: 72 రోజుల నయా ప్లాన్ తీసుకొచ్చిన జియో.. బీఎస్‌ఎన్‌ఎల్ కు బిగ్ షాక్.. పూర్తి వివరాలు ఇవే?
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు మరో అద్భుతమైన రీచార్జి ప్లాన్ ను తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ కు షాక్ ఇస్తూ మరో అద్భుతమైన ప్లాన్ తీసుకువచ్చింది..
- By Anshu Published Date - 11:03 AM, Thu - 23 January 25

ప్రముఖ టెలికాం సంస్థలు ఉద్యో బీఎస్‌ఎన్‌ఎల్ గత కొద్ది రోజులుగా ఒకదానితో ఒకటి గట్టిగానే పోటీపడుతున్న విషయం తెలిసిందే. మొదట జియో సంస్థ టెలికాం ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులందరూ చేసేదేమీ లేక బీఎస్‌ఎన్‌ఎల్ కు పోర్ట్ అయిపోయారు. ఎక్కువ మొత్తంలో వినియోగదారులు జియో నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ కు పోర్ట్ అవ్వడంతో దెబ్బకు జియో సంస్థ దిగి వచ్చింది. దానికి తోడు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ లను ప్రవేశ పెట్టడంతో చాలామంది జియోకి గుడ్ బాయ్ చెప్పేశారు.
దీంతో కాస్త తగ్గిన జియో సంస్థ వినియోగదారుల కోసం తక్కువ ధరకే అద్భుతమైన రీచార్జ్ ప్లాన్లను తీసుకువస్తోంది. ఈ విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కు గట్టి పోటీని ఇస్తోంది. అందులో భాగంగానే తాజాగా 72 రోజుల జియో ప్లాన్ అద్భుతంగా బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటుంది. మరి ఈ రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ధర రూ.749 బడ్జెట్ ఫ్రెండ్లీ అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రీఛార్జీ ప్లాన్ రూ. 749 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. అంతేకాదు ఫ్రీ లోకల్, ఎస్టిడి ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చ.
అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందవచ్చు. ఈ 72 రోజుల ప్లాన్ లో ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. అంటే ప్లాన్ మొత్తంలో 144 జీబీ అందుకుంటారు. ఇదే కాకుండా అదనంగా 20 జీబీ అదను డేటా కూడా పొందవచ్చట. అంటే మొత్తం 164 జీబీ పొందవచ్చట. మీ ఏరియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే అపరిమిత 5జి డేటా పొందవచ్చని చెబుతున్నారు. కేవలం ఇవే కాకుండా అదనంగా ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే జియో సినిమా ఉచితంగా పొందవచ్చట. అంటే అదనపు ఖర్చు లేకుండా సినిమాలను ఫ్రీగా ఆస్వాదించవచ్చట. అలాగే జియో టీవీ ఛానల్స్ కూడా ఫ్రీగా పొందవచ్చని చెబుతున్నారు. ఇంకా జియో కాంప్లిమెంటరీ క్లౌడ్ స్టోరేజ్ కూడా యూజర్లు ఉచితంగా పొందవచ్చట. అంటే రూ.749 రూపాయలతో లాంగ్ టైం వాలిడిటీ ఆప్షన్ మాత్రమే కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్,హై స్పీడ్ డేటా తో పాటు జియో క్లౌడ్ ఉచితంగా పొందవచ్చట. ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.