Jio 5G: అద్భుతమైన ఫీచర్ లతో జియో 5జి ఫోన్.. ధర ఎంతో తెలుసా?
జియో సంస్థ సంగతి ఏడాది జియో ఫోన్ నెక్స్ట్ ను సామాన్యులకు స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేయాలి అన్న ఆలోచనతో
- By Nakshatra Published Date - 03:21 PM, Tue - 16 August 22
జియో సంస్థ సంగతి ఏడాది జియో ఫోన్ నెక్స్ట్ ను సామాన్యులకు స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేయాలి అన్న ఆలోచనతో కేవలం రూ.5 వేలు రూపాయలకు ఆకర్షణీయమైన ఫీచర్స్ అందించే ఫోను విడుదల చేసింది. ఇక ఈ జియో ఫోన్ ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తిని కనబరిచారు. అయితే దీనికి కొనసాగింపుగా త్వరలోనే జియో కంపెనీ 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. కాగా ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనుల పై కంపెనీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దసరా పండుగకి లేదా ఈ ఏడాది చివరి నాటికి జియో 5జీ ఫోన్‌ను మార్కెట్ లోకి విడుదల చేస్తారని సమాచారం. మరిఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్ లు ఉంటాయి? ధర ఎంత అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జియో 5జీ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే,గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ ఫోన్ పనిచేస్తుందట. అలాగే స్నాప్‌డ్రాగన్ 480, 5 జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉంటుంది. ఈ మొబైల్ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయట. ఇక వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 2 ఎంపీ కెమెరా, ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారట. వెనుక లేదా సైడ్‌లో ఫింగర్ ప్రింగ్ సెన్సర్ ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
4 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. ఈ జియో 5జీ ఫోన్ ధర రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలో యూజర్లు ₹ 2,500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునేలా ఈఎంఐ పద్ధతి ఉంటుందని సమాచారం.
Tags
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.