Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి.
- By Nakshatra Published Date - 07:00 AM, Sat - 18 March 23

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. వినియోగదారుల కోసం ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన ఐటెల్ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.
తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఐటెల్ పీ40 పేరుతో ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్ లలో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఐటెల్ పీ40 ఫోన్ ధర రూ. 7,699 గా ఉంది. ఐటెల్ పి 40 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై నడుస్తుంది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్డీ + ఐపీస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఫోన్ డిస్‌ప్లేలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ కూడా ఇవ్వబడింది.
ఈ ఫోన్ గరిష్టంగా 4GB ర్యామ్ ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది 3జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌కు కూడా మద్దతునిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. దీని ప్రైమరీ కెమెరా 13ఎంపీ. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉంది. కాగా ఈ ఫోన్ బ్యాటరీ విజయానికి వస్తే.. ఇది 6,000mAh సామర్థ్యంను కలిగి ఉండనుంది.

Related News

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం