Itel A24 Pro: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి.
- By Nakshatra Published Date - 07:30 AM, Mon - 23 January 23

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. వినియోగదారుల కోసం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే మార్‌క్యూ దగ్గరి నుంచి జియో వరకు పలు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నాయి. రూ. 5 వేల కన్నా తక్కువే ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లోకి రూ. 5 వేల కంటే తక్కువ ధరకే ఒక స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. తాజాగా మార్కెట్ లోకి ఐటెల్ కంపెనీ ఏ24 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యింది. కాగా ఇది 4జీ స్మార్ట్ ఫోన్. ఇందులో 5 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది.
స్టోరేజ్ 32 జీబీ ఉంటుంది. ఈ ఫోన్ రేటు రూ. 4,600. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ యూనిసెక్ ఎస్‌సీ9832ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 2 ఎంపీ కెమెరా ముందు భాగంలో 0.3 ఎంపీ కెమెరాతో లభించనుంది. అంతేకాకుండా ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 3020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిఉండనుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ బాంగ్లాదేశ్ లో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి కూడా విడుదల కానుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 5,999 గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 4499కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్‌లో 5.45 అంగుళాల స్క్రీన్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇదే కాకుండా ఐటెల్ నుంచి మరో ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఐటెల్ ఏ23 ప్రో అనే స్మార్ట్‌ఫోన్ ధర రూ. 4,999 గా ఉంది. కానీ దీనిని అమెజాన్‌లో రూ. 3899కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్ల ఉన్నాయి.
Related News

LPG cylinder: పెరిగిన ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు, ఒక్కసారిగా రూ.209 పెంపు
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల