iQOO Z9 Pro Series: మార్కెట్ లోకి రాబోతున్న ఐక్యూ Z9 ప్రో.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్!
ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఐక్యూ సంస్థ ఇప్పుడు మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
- By Anshu Published Date - 12:30 PM, Fri - 16 August 24

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ సంస్థ భారత మార్కెట్లోకి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈనెల ఆగస్టు 21న భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్9ఎస్, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ ల డిజైన్, కలర్ ఆప్షన్లు, చిప్‌సెట్ వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఐక్యూ జెడ్9ఎస్ ఒక మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది.
అయితే, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ను పొందుతుంది. ఇప్పుడు, ఐక్యూ రాబోయే హ్యాండ్ సెట్‌ల డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యం, ఐపీ రేటింగ్ తో సహా అనేక మరిన్ని ఫీచర్లను ధృవీకరించింది. ఇకపోతే ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో కీలక ఫీచర్ల విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే లను కలిగి ఉంటాయని కంపెనీ అధికారిక మైక్రోసైట్ లో ధృవీకరించింది. ఐక్యూ ప్రో వెర్షన్ 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయికి సపోర్టు ఇస్తుంది. ఈ రెండు హ్యాండ్ సెట్‌లు దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటెడ్ బిల్డ్‌లతో వస్తాయని నిర్ధారించింది. ఈ ఫోన్ లు 0.749సెం.మీ మందం కలిగి ఉంటాయి.
అలాగే ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో రెండూ 5,500mAh బ్యాటరీ లను పొందుతాయి. ఐక్యూ ప్రో ఆప్షన్ కూడా 80 డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు అందిస్తుంది. ఐక్యూ జెడ్9 ఛార్జింగ్ సామర్థ్యం ఇంకా నిర్ధారించలేదు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రోలు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ లను కలిగి ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50ఎంపీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ సెన్సార్ తో సహా బేస్ వెర్షన్ 2ఎంపీ డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఐక్యూ ప్రో వేరియంట్ 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. రెండు హ్యాండ్‌సెట్ లలోని సెన్సార్ లు 4కె ఓఐఎస్ సపోర్టెడ్ వీడియో రికార్డింగ్ ను అందిస్తాయి. అలాగే, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్, ఏఐ ఎరేస్ వంటి ఏఐ సపోర్టు గల ఫీచర్ లను కూడా అందిస్తాయి. మైక్రోసైట్ ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రోలు వరుసగా మీడియాటెక్ డైమన్షిటీ 7300, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ల ద్వారా పవర్ అందిస్తుందని తెలిపింది. వెనిలా ఐక్యూ Z9ఎస్ మోడల్ ఒనిక్స్ గ్రీన్, టైటానియం మ్యాట్ షేడ్స్‌లో అందిస్తుంది. ఐక్యూ ప్రో వెర్షన్ ఫ్లాంబోయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది.