iPhone 15 ultra price: మార్కెట్లోకి ఐఫోన్ 15 అల్ట్రా ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ఐఫోన్. ఐఫోన్ ను చాలామంది ఉపయోగించాలి
- By Nakshatra Published Date - 07:00 AM, Wed - 14 December 22
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ఐఫోన్. ఐఫోన్ ను చాలామంది ఉపయోగించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర విషయంలో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఐఫోన్ సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తక్కువ ధరతో ఎక్కువ ఫిచర్స్ కలిగిన ఐఫోన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా యాపిల్ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ ఐ ఫోన్ 15 అల్ట్రాను లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
కాగా ఇటివలే మార్కెట్లోకి విడుదల అయిన ఐఫోన్ 14 వినియోగదారులను అంత సంతృప్తి పరచలేదు. అంతకు ముందు మోడల్ కు దీనికి పెద్దగా వేరియేషన్ లేకపోవడంతో వినియోగదారులు చాలా వరకు నిరాశ చెందారు. దీంతో యాపిల్ సంస్థ దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా ఐఫోన్ 15 ఆల్ట్రాను తీసుకువస్తోంది. ఇకపోతే దీని ధర ఫీచర్ల విషయానికి వస్తే.. అయితే యాపిల్ సంస్థ ఈ ఐఫోన్ 15 ధర ఎంత అన్నది వెల్లడించలేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 14 కన్నా 200 డాలర్లు అధికంగా కొత్త ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క ఫోన్ ధర 1,299 డాలర్లు ఉండొచ్చని సమాచారం.
అనగా మన ఇండియన్ కరెన్సీలో ప్రకారం దాదాపుగా రూ. 1,07,330 గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ధర కంటె ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రో మ్యాక్స్ అమెరికాలో 1,099 డాలర్లు కాగా దానిని ఇండియాలో రూ. 1,39,900లకు విక్రయించారు. వాస్తవానికి 1,099 డాలర్ లు అనగా 90,810 రూపాయలు మాత్రమే.కాని దానకి కస్టమ్ డ్యూటీ చార్జ్ కలిపితే రేటు పెరుగుతుంది. ఐఫోన్14 లో పెద్దగా మార్పులు చేయకపోవడంతో వినియోగదారులకు అది పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో రానున్న 15 మోడల్లో పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు సొర్సెస్ ద్వారా తెలుస్తోంది. లేటెస్ట్ మోడల్ లో కెమెరా మొదలు ప్రాసెసర్ వరకు అన్ని అత్యాధునిక ఫీచర్లను జోడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.