iPhone 14 Series: ఐఫోన్ 14 ధర , ఫీచర్స్ లీక్
ఈ ఏడాది సెప్టెంబరు లో విడుదలయ్యే అవకాశాలున్న ఐఫోన్ 14 ఫోన్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అందులో ఎలాంటి అడ్వాన్డ్ ఫీచర్స్ ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.
- By Hashtag U Published Date - 12:13 PM, Sat - 28 May 22
ఈ ఏడాది సెప్టెంబరు లో విడుదలయ్యే అవకాశాలున్న ఐఫోన్ 14 ఫోన్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అందులో ఎలాంటి అడ్వాన్డ్ ఫీచర్స్ ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో అందులో ఉండొచ్చని భావిస్తున్న కొన్ని ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. అవేమిటంటే.. ఐఫోన్ 14 లో నాలుగు మోడళ్లు తొలుత విడుదల కానున్నాయి. ఐఫోన్ 14 తో పాటు ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి.
ధరల విషయానికొస్తే.. ఐఫోన్ 13 ప్రో ధర భారత్ లో ప్రస్తుతం రూ.1.19 లక్షలు ఉంది. ఐఫోన్ 14 ప్రో ధర దీని కంటే రూ.9300(120 డాలర్లు) ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. 48 మెగా పిక్సెల్ సెన్సర్ , 120 hz డిస్ ప్లే తో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు వస్తాయి. వీటి డిజైనింగ్ ఐఫోన్ 13 ను పోలిన విధంగానే ఉంటుంది. అయితే ఐఫోన్ 14 మ్యాక్స్, ప్రో మ్యాక్స్ మోడళ్ల ఫోన్లు 6.7 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉండొచ్చు. 1284×2778 రేజెల్యూషన్ ను సపోర్ట్ చేసేలా ఈ స్క్రీన్ ఉంటుందని అంటున్నారు. ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో బయోనిక్ ఏ16 చిప్ సెట్ ఉండనుంది. మిగితా కొత్త మోడళ్లలో బయోనిక్ ఏ15 చిప్ సెట్ ఉంటుంది. ఐఫోన్ 14 ప్రో, మ్యాక్స్, ప్రో మ్యాక్స్ మోడళ్లలో 8 జీబీ ర్యామ్, 2 టీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. వీటిలో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. ఎల్జీ కంపెనీ తో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్రంట్ కెమెరాలను వీటిలో వాడారు. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదుర్స్ అనిపించక మానదు.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.