Instagram:ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పుడు పెద్ద సైజు వీడియోలు కూడా..!
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఇన్ స్టా గ్రామ్’ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
- By Hashtag U Published Date - 02:05 PM, Mon - 26 September 22
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఇన్ స్టా గ్రామ్’ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ప్రస్తుతం పెద్ద సైజు వీడియోలను పోస్ట్ చేసే అవకాశం లేదు. పోస్ట్ చేస్తే, దాన్ని 15 సెకన్ల నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్ లుగా సాఫ్ట్ వేర్ విడగొడుతోంది. ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. 60 సెకన్లు, అంటే ఒక నిమిషం వరకు నిడివి ఉన్న వీడియో ఒక్కటిగానే పోస్ట్ అవుతుంది. చిన్న చిన్న క్లిప్ లుగా విడిపోవడం ఉండదు.
ఈ విషయాన్ని మెటా (మాతృ సంస్థ) కూడా ధ్రువీకరించినట్లు ‘టెక్ క్రంచ్’ అనే పోర్టల్ విశ్వసనీయ సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. టిక్ టాక్ కు గట్టి పోటీ నిచ్చేందుకు ఇన్ స్టా గ్రామ్ ఈ ఫీచర్ ను మార్చినట్టు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఎక్కువగా వీడియోలను పోస్ట్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. త్వరలోనే అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందన్నది తాజా సమాచారం.
Related News
Nidhhi Agerwal: ఎంతలా అందాలను ఆరబోసినా ఆ విషయంలో మాత్రం వెనకబడిన నిధి అగర్వాల్!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్�