Infinix Zero 20: ఫ్లిప్ కార్ట్ లో ఇన్ ఫినిక్స్ జీరో 20 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి
- By Nakshatra Published Date - 07:00 AM, Fri - 30 December 22
టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు నచ్చే విధంగా అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో రకాల స్మార్ట్ఫోన్లను ఆయా కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ నెల ప్రారంభంలో భారత్ మార్కెట్ లో ఇన్ ఫినిక్స్ సంస్థ రిలీజ్ చేసిన ఇన్ ఫినిక్స్ జీరో 20 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ యాప్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. సరికొత్త డిజైన్, కొత్త 4 జీ ఎస్ఓసీ తో సేల్ లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ లో 108 ఎంపీ కెమెరాతో పాటు 60 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో లభిస్తోంది. అలాగే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో రానుంది. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ15999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఫెడరల్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే పది శాతం ఇన్ స్టెంట్ గా తగ్గింపు లభిస్తుంది. కాగా ఈ ఇన్ ఫినిక్స్ జీరో 20 మొబైల్ మూడు కలర్ లలో లభించనుంది. అవి డిప్ గ్రే, గిట్టర్ గోల్డ్, గ్రీన్ ఫాంటసీ షేడ్స్ లో లభిస్తోంది. కాగా ఈ ఇన్ ఫినిక్స్ జీరో 20 ఫీచర్ ల విషయానికి వస్తే..
6.7 అంగుళాల డిస్ ప్లేతో ఐపీఎస్ ఎమోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 60 ఎంపీ సెల్ఫీ కెమెరా 108 ఎంపీ బ్యాక్ కెమెరా విత్ 13 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్త్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 6 ఎన్ఎం మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్, 45 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉండనుంది. అదేవిధంగా 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, చార్జింగ్ కోసం టైప్ సీ కేబుల్ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ను సపోర్ట్ చేస్తుంది.
Related News
Flipkart Super Cooling Days 2024: నేటి నుంచి ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్స్.. ఈ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు..!
‘సూపర్ కూలింగ్ డేస్ 2024’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్లో AC (ఎయిర్ కండీషనర్), రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్, ఫ్యాన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.