Infinix Note 50 Pro Plus: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మార్కెట్లోకి రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్.. ధర ఫీచర్స్ ఇవే!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ధర వివరాలు లీక్ అయ్యాయి.
- By Anshu Published Date - 03:00 PM, Wed - 19 March 25

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చిన ఇన్ఫినిక్స్ సంస్థ, ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తూనే ఉంది. వీటితోపాటు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకోవాల్సిన స్మార్ట్ ఫోన్ లలో వేరియేషన్లను కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇన్ఫినిక్స్ సంస్థ మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది. ఈ నెల 20న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా మార్కెట్లోకి విడుదల కాకముందే అప్పుడే స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ నెల ప్రారంభంలో ఇండోనేషియాలో ఇన్ఫినిక్స్ నోట్ 50, ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రోతో పాటు లాంచ్ అయింది. కాగా ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ ఆర్మర్ అల్లాయ్ బిల్డ్, 100x జూమ్‌తో 50 ఎంపీ పెరిస్కోప్ కెమెరా, జేబీఎల్ ద్వారా ఆడియో ట్యూనింగ్, వన్ ట్యాప్ ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుందట. ఇకపోతే ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 50ప్రో ప్లస్ 5జీ లైవ్ ఇమేజ్ లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఆక్టాగోనల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉందట. ఈ ఫోన్ 100x జూమ్ సామర్థ్యంతో 50ఎంపీ పెరిస్కోప్ సెన్సార్ ను అందిస్తుందని చెబుతున్నారు.
అలాగే డిజైన్ పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో కూడిన ఆర్మర్ అల్లాయ్ బిల్డ్ ను కలిగి ఉంటుందట. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 4జీ మాదిరిగానే హైపర్ కాస్టింగ్ ఆప్సన్ కూడా కలిగి ఉంటుందట. ఇన్ఫినిక్స్ ఫోన్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ దిగువన సిమ్ ట్రే, ఛార్జింగ్ కోసం USB టైప్ సి పోర్ట్, ఆడియో ట్యూనింగ్ సౌండ్‌బై జేబీఎల్ లోగో కూడా ఉన్నాయట. దీనికి ఎదురుగా సెకండరీ మైక్రోఫోన్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయట. అలాగే ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మరో అద్భుతమైన ఫీచర్ అయిన వన్ ట్యాప్ ఇన్ఫినిక్స్ ఏఐ కలిగి ఉందట. ప్రపంచ మార్కెట్లలో ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ధర 500 డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 43,400 కన్నా తక్కువగా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.