AI News Anchor : వామ్మో.. ఏఐ న్యూస్ యాంకర్లు వచ్చేసారుగా..!!
AI News Anchor : ఏఐ వర్చువల్ యాంకర్ల ప్రవేశం ఒకవైపు పరిశ్రమలో అభివృద్ధికి దోహదపడుతుంటే, మరోవైపు ఉద్యోగ భద్రతపై అనేక ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయి
- Author : Sudheer
Date : 30-06-2025 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో మీడియా రంగం కూడా ఈ సాంకేతికతను ఆకర్షణీయంగా స్వీకరిస్తోంది. ముఖ్యంగా న్యూస్ ఛానెళ్లలో ఏఐ ఆధారిత వర్చువల్ యాంకర్లు (AI News Anchor) వైరల్ అవుతున్నారు. ఈ వర్చువల్ యాంకర్లు విభిన్న భాషలలో వార్తలను సహజంగా మాట్లాడగలిగే, మనుషుల్లా కనిపించే, అన్ని అభిప్రాయాలను ఇవ్వగలిగే సామర్థ్యంతో రూపొందించబడ్డారు. తమిళంలో ఇప్పటికే కొన్ని ఛానెళ్లు ఈ వ్యవస్థను ప్రారంభించగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ప్రారంభ దశలోనే ఉంది.
Hydraa : మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. బడా బిజినెస్ మాన్ పై కేసు నమోదు
ఏఐ న్యూస్ యాంకర్లు 24 గంటల పాటు పని చేయగలిగే సామర్థ్యం, అలసట లేకుండా తాజా వార్తలు అందించగలగడం, ఖర్చులను తగ్గించడం, స్థిరత, ఖచ్చితత్వం వంటి అంశాల్లో మీడియా సంస్థలకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. వార్తల డెలివరీని ఆటోమేట్ చేయడం ద్వారా ఒకే సమయంలో అనేక భాషలలో కంటెంట్ రూపొందించడం సులభమవుతోంది. దీంతో మానవ వనరులను ఇతర ముఖ్యమైన పని విధానాలకు మళ్లించే అవకాశం కలుగుతోంది. ఇది వార్తా సంస్థలకు ఆపరేషనల్ ఖర్చును గణనీయంగా తగ్గించే అవకాశాన్ని అందిస్తోంది.
Telangana BJP Chief : ఈటలకు బిజెపి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకుందెవరు..?
ఏఐ వర్చువల్ యాంకర్ల ప్రవేశం ఒకవైపు పరిశ్రమలో అభివృద్ధికి దోహదపడుతుంటే, మరోవైపు ఉద్యోగ భద్రతపై అనేక ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న యాంకర్లు ఉద్యోగాలు కోల్పోవచ్చన్న భయం, డీప్ ఫేక్ వీడియోల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం, ఈ సాంకేతికతపై నిఘా అవసరాన్ని ప్రస్తావిస్తున్నాయి. సాంకేతికతను సమర్థవంతంగా నియంత్రించి, మానవ వనరులను కోల్పోకుండా ఏఐ వర్చువల్ యాంకర్లను మీడియా రంగ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.