Xiaomi 14: షావోమి ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం ఎటువంటి పండుగలు సెలబ్రేషన్స్ లేకపోయినప్పటికీ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రోజురోజుకీ కంపెనీల మధ్య పోటీలు నెలకొంటున్నా నేపథ్యంలో కంపెనీలు ఒకదానిని మించి ఒకటి భారీగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి
- By Anshu Published Date - 12:00 PM, Thu - 18 July 24

ప్రస్తుతం ఎటువంటి పండుగలు సెలబ్రేషన్స్ లేకపోయినప్పటికీ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రోజురోజుకీ కంపెనీల మధ్య పోటీలు నెలకొంటున్నా నేపథ్యంలో కంపెనీలు ఒకదానిని మించి ఒకటి భారీగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ స్మార్ట్ ఫోన్ పై కూడా భారీగా తగ్గింపు ధర్మం ప్రకటించాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ 14పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
కాగా ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,999 గా ఉంది. ప్రీమియం సెగ్మెంట్ లో తీసుకొచ్చిన ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చారు. అయితే తాజాగా అమెజాన్ లో ఈ ఫోన్ పై 13 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ను రూ. 69,998కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదండోయ్, పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ను ఏకంగా రూ. 20 వేల తగ్గింపు ధరకే పొందవచ్చు. వీటితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 54,900 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇకపోతే షావోమీ 14 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయాకొస్తే..
ఇందులో 6.36 ఇంచెస్ తో కూడిన 1.5కే రిజల్యూషన్ తో కూడిన ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్ లో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందించారు. దీంతో స్క్రీన్ ను సన్ లైట్ లో కూడా స్పష్టంగా చూడవచ్చు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, 4ఎన్‌ఎమ్ ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇక ఈ ఫోన్ లో 50 వాట్స్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ తో పాటు, 120 వాట్స్ హైపర్ ఛార్జర్ కు సపోర్ట్ చేసే 4610 బ్యాటరీని సైతం అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే..ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రియిర్ కెమెరాను అందించారు. మొత్తం మూడు 50 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ ను కూడా అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. కానీ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఈ కామర్స్ సంస్థ.