Honor 200: అద్భుతమైన ఫీచర్లతో లాంచింగ్ కి సిద్ధమవుతున్న హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఈ నేపథ్యంలో
- By Nakshatra Published Date - 01:14 PM, Fri - 5 July 24
![Honor 200: అద్భుతమైన ఫీచర్లతో లాంచింగ్ కి సిద్ధమవుతున్న హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/MixCollage-05-Jul-2024-01-13-PM-4211.jpg)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. మరి ఆ వివరాల్లోకి వెలితే.. కాగా హానర్ 200, హానర్ 200 ప్రో పేర్లతో ఈ ఫోన్లను తీసుకొస్తోంది.
త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్లను తీసుకురాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. హానర్ 200 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 2664 x 1200 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్‌ను అందింనున్నారు. 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం అని చెప్పవచ్చు. అలాగే హానర్ 200 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రాబోతుందట. అలాగే ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారట.
ఇకపోతే హానర్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే.. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లే ను అందించారు. అలాగే 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 50 ఎంపీ కెమెరా ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. కాగా ఈ రెండు వేరియంట్ల ధర విషయానికొస్తే.. హానర్ 200 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,000 కాగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 37,000గా ఉండనుంది. అదేవిదంగా ఇక హానర్ 200 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.40 వేలుగా, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ధర రూ. 51,00గా ఉండవచ్చని అంచనా.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Tecno Spark 20 Pro: లాంచింగ్ కి సిద్ధమైన టెక్నో ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/MixCollage-06-Jul-2024-06-11-PM-5118.jpg)
Tecno Spark 20 Pro: లాంచింగ్ కి సిద్ధమైన టెక్నో ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం మార్కెట్లో 5 జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే నెమ్మదిగా 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో మొబైల్ తయారీ సంస్థలు 5జీ నె