WhatsApp: వాట్సాప్లో 7 హిడెన్ ట్రిక్స్.. ఎవరికీ తెలియని సూపర్ ఫీచర్స్ ఇవే?
- By Anshu Published Date - 07:00 PM, Wed - 27 December 23

వాట్సాప్ ని కోట్లాదిమంది వినియోగిస్తున్నప్పటికీ అందులో 7 అద్భుతమైన ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. మరి ఆ హిడెన్ ఫీచర్స్ ఎలా పాపులర్ అయ్యాయి ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి అన్న విషయానికొస్తే.. అందులో మొదటిది గ్రూప్ చాట్‌లో ప్రైవేట్ రిప్లైస్.. గ్రూప్ చాట్‌లో ఎవరికైనా ఈజీగా ప్రైవేట్ మెసేజ్ పంపించడానికి వాట్సాప్ రిప్లై ప్రైవేట్లీ అనే ఫీచర్ కనిపిస్తుంది. గ్రూపులో ఏదైనా చాట్‌కి వెళ్లి ఏ నంబర్‌కి అయితే ప్రైవేట్ మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి మెసేజ్‌పై హోల్డ్ చేసి పట్టుకుంటే రిప్లై ప్రైవేట్లీ ఫీచర్ కనిపిస్తుంది.
రెండవది మేనేజ్ గ్యాలరీ.. వాట్సాప్‌లో అందుకునే మీడియా కంటెంట్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. అవసరమైనవి అయితే పర్లేదు కానీ అనవసరమైన కూడా సేవ్ అయితే గ్యాలరీ చిందరవందరగా మారుతుంది. ఫోన్ స్టోరేజీ కూడా తగ్గిపోతుంది. దీనికి పరిష్కారంగా వాట్సాప్‌లో అందుకునే కంటెంట్ ఫోన్‌లో సేవ్ కాకుండా ఆపడమే. అందుకు ఎక్కువ మీడియా కంటెంట్ పంపించే చాట్ లేదా గ్రూప్ చాట్ ఇన్ఫోకి వెళ్లి మీడియా విజిబిలిటీ ఆప్షన్‌పై నొక్కి నో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డివైజ్ గ్యాలరీలో వాట్సాప్ మీడియా కంటెంట్ సేవ్ అవ్వదు.
ఇక మూడవది వ్యూ వన్స్.. వాట్సాప్‌లో రీసెంట్ టైమ్స్‌లో అందుబాటులోకి వచ్చిన మోస్ట్ యూజ్‌ఫుల్ ప్రైవసీ ఫీచర్ వ్యూ వన్స్.. కానీ దీనిని ఇప్పటికీ చాలామంది వాడటం లేదు. ఏదైనా సెన్సిటివ్ ఫొటో, వీడియో పంపించేటప్పుడు అవతలి వ్యక్తి స్క్రీన్ షాట్ తీయకుండా, షేర్ చేయకుండా, ఫార్వర్డ్, కాపీ చేయకుండా ఆపడానికి దీనిని వాడవచ్చు. ఏదైనా ఫొటో ఎంచుకున్నాక యాడ్ క్యాప్షన్ బాక్స్‌లో కనిపించే 1 ఐకాన్‌పై నొక్కడం ద్వారా ఈ ఫీచర్ వాడవచ్చు.
నాలుగవది వాయిస్ స్టోరీస్.. స్టేటస్‌లో వాయిస్ స్టోరీలు షేర్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ పరిచయం చేసింది. అప్‌డేట్ ట్యాబ్‌కి వెళ్లి పెన్సిల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, మైక్రోఫోన్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. 30 సెకన్లలోపు వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్‌గా షేర్ చేసుకోవచ్చు.
ఐదవది మెసేజ్ రీడ్ టైమ్‌స్టాంప్స్.. పంపిన మెసేజ్‌ను రిసీవర్ కచ్చితంగా ఏ టైమ్‌కి చూసారో తెలుసుకునేందుకు మెసేజ్‌పై టాప్ చేసి ఇన్ఫో (i) ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అంతే రిసీవర్ దానిని ఏ టైమ్‌కి చదివారో తెలుసుకోవచ్చు. అయితే రిసీవర్ రీడ్ రిసిప్ట్స్ ఆన్ చేస్తేనే మెసేజ్ రీడ్ టైమ్‌స్టాంప్స్ తెలుసుకోవడం కుదురుతుంది.
ఆరవది టెక్స్ట్ ఫార్మాటింగ్.. వాట్సాప్‌లో పంపించే మెసేజ్‌ల ఫాంట్‌ను బోల్డ్, ఇటాలిక్, ఇంకా రకరకాల ఫార్మాట్స్‌లో మార్చుకోవచ్చు. బోల్డ్ టెక్స్ట్ కోసం మెసేజ్ ఇలా ఒక పదం లేదా వాక్యం ముందు, చివర స్టార్స్ యాడ్ చేయాలి. ఇటాలిక్స్ టెక్స్ట్ కోసం మెసేజ్(_) ఇలా ఒక పదం లేదా వాక్యం ముందు చివర, అండర్ స్కోర్స్ యాడ్ చేయాలి. క్రాస్ ఔట్ టెక్స్ట్ కోసం టెక్స్ట్ కోసం మెసేజ్(~) ఇలా ఒక పదం లేదా వాక్యం ముందు, చివర యాడ్ చేయాలి. ఈ ఫార్మాట్ స్టయిల్స్ కాంబైన్ కూడా చేసి ఇటాలిక్స్, బోల్డ్ టెక్స్ట్ లో మెసేజెస్ సెండ్ చేయవచ్చు.
గ్రూప్ చాట్ నుంచి సీక్రెట్‌గా వైదొలగడం.. అలాగే ఇబ్బంది కలిగించే ఏదైనా ఒక గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అడ్మిన్స్‌కి ఆ విషయం తెలుస్తుంది. వారు ఎందుకు లీవ్ అయ్యావ్ అని ప్రశ్నించి మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అదంతా లేకుండా గ్రూప్ నుంచి సీక్రెట్‌గా వెళ్లిపోవడానికి ఒక మార్గం ఉంది. సైలెంట్‌గా గ్రూప్ చాట్ నుంచి ఎగ్జిట్ డైరెక్ట్‌గా బటన్ లేదు కానీ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్లతో సైలెంట్‌గా ఎగ్జిట్ అయిన ప్రయోజనాలు పొందొచ్చు. సీక్రెట్‌గా ఒక గ్రూప్ డిస్టర్బ్ చేయకుండా ఆపడానికి ముందుగా గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లి మ్యూట్ సెక్షన్‌లో ఫరెవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.