Amla: ఉసిరికాయ ప్రతిరోజు తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఉసిరికాయలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 21 November 24

చలికాలం మొదలయింది అంటే చాలు మనకు ఉసిరికాయలు విరివిగా లభిస్తూ ఉంటాయి. కార్తీక మాసం సమయంలో ఈ ఉసిరికాయలు మనకు ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని కొందరు పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగిస్తే మరికొందరు రకరకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి రుచి పుల్లగాను వగరుగాను ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ, కాంప్లెక్స్‌తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయట. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరి ఉసిరికాయ రోజులు తినడం ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయానికొస్తే.. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్ ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుందట. అలాగే గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుందట. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు ఉసిరికాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఉసిరికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కారణంగా వీరిని తిన్నప్పుడు త్వరగా ఆకలి వేయదట.
తద్వారా ఆహారం తక్కువగా తినవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది. ఉసిరి తరచుగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారట. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుందట. ఉసిరి రోజు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, అలానే ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో ఫైబర్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.