HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Googles Photomath App Helps You Solve Maths Problems With Ai

Photomath App : ఫోటో తీస్తే చాలు ‘లెక్క’ సాల్వ్.. గూగుల్ ‘ఫోటోమ్యాథ్’ యాప్

Photomath App : కఠినమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ కోసం చాలామంది గూగుల్‌, యూట్యూబ్‌‌లలో వెతుకుతుంటారు.

  • Author : Pasha Date : 02-03-2024 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Photomath App
Photomath App

Photomath App : కఠినమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ కోసం చాలామంది గూగుల్‌, యూట్యూబ్‌‌లలో వెతుకుతుంటారు. ఇలాంటి వారికిి ఇక వెతుకులాట అక్కర్లేదు. ఎందుకంటే.. గూగుల్ సరికొత్త ఏఐ యాప్‌ను లాంచ్ చేసింది. దానిపేరు ‘ఫోటోమ్యాథ్’. మనకు కొరకరాని కొయ్యగా మారిన  మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌‌ను ఈ యాప్‌లో ఒక్క ఫోటో తీస్తే చాలు.. నేరుగా సమాధానం ప్రత్యక్షం అవుతుంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే..  ఈ యాప్ ఒక స్మార్ట్ కెమెరా కాలిక్యులేటర్‌ అండ్ మ్యాథ్స్ అసిస్టెంట్ యాప్.  మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన సొల్యూషన్స్‌ను ఈ యాప్ స్టెప్ బై స్టెప్‌గా వివరణాత్మకంగా అందిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

  • 2023 మార్చిలో ‘ఫోటోమ్యాథ్’ (Photomath App) యాప్‌ను గూగుల్ కొనుగోలు చేసింది.
  • ఈ యాప్ ఇప్పుడు పూర్తిగా గూగుల్ యాప్ పోర్ట్‌ఫోలియోలో విలీనం చేయబడింది.
  • ‘ఫోటోమ్యాథ్’ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
  • ఈ యాప్ ద్వారా బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, గణాంకాలు, కాలిక్యులస్‌ సహా వివిధ విషయాలలో గణిత సమస్యలకు పరిష్కారాన్ని పొందొచ్చు.
  • ‘ఫోటోమ్యాథ్’ యాప్‌ ఇంటిగ్రేషన్‌తో గూగుల్ తన ఎడ్యుకేషనల్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.
  • గణితం నేర్చుకోవడాన్ని,  దాని సమస్యల పరిష్కారాన్ని వెతకడాన్ని సులభతరం చేయడానికి దోహదపడే టెక్నాలజీ  ‘ఫోటోమ్యాథ్’ యాప్‌లో ఉంది.

Also Read : ISRO Vigyani : విద్యార్థులకు ‘ఇస్రో విజ్ఞాని’గా మారే ఛాన్స్.. అప్లై చేయండి

‘ఫోటోమ్యాత్’ వాడటం ఇలా.. 

  • ఆండ్రాయిడ్ డివైజ్‌లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి  లేదా iOS పరికరాలలో App Store నుంచి “Photomath” యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • యాప్‌ని తెరిచి, మీరు పరిష్కరించాలనుకుంటున్న గణిత సమస్య వైపుగా కెమెరాను ఆన్ చేయండి. మొత్తం గణిత సమస్య ఒక ఫ్రేమ్‌లో ఫిట్ కావాలి.
  • స్కానింగ్ చేయడం సాధ్యం కాకపోతే.. మీరు మ్యాథ్స్ సమస్యను మాన్యువల్‌గా టైప్ చేయడానికి అంతర్నిర్మిత గణిత కీబోర్డ్‌ ఉంటుంది.
  •  మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను స్కాన్ లేదా టైప్ చేసిన తర్వాత ఫోటోమ్యాథ్ యాప్ దాన్ని ప్రాసెస్  చేసి పరిష్కారాన్ని చూపిస్తుంది.
  • ఈ యాప్ బీజగణితం(Algebra), జ్యామితి(Geometry), త్రికోణమితి(Trigonometry), గణాంకాలు(Statistics)  సహా వివిధ గణిత అంశాలను పరిష్కరించగలదు.
  • మెరుగైన వినియోగదారు అనుభవం కోసం ఇందులో వివిధ భాషల ఆప్షన్లు కూడా ఉన్నాయి.
  • యాడ్స్ లేకుండా ఈ యాప్‌ను వాడేందుకు, అదనపు ఫీచర్‌ల కోసం వినియోగదారులు ‘ఫోటోమ్యాథ్ ప్లస్‌’లో సభ్యత్వాన్ని పొందొచ్చు.
  • ఫోటోమ్యాథ్ యాప్‌ను  క్రొయేషియాలో డెవలప్ చేశారు. దీన్ని డెవలపర్లు 2014లో లాంచ్ చేశారు.
  • Photomath యాప్‌కు ఇప్పటికే 10 కోట్లకుపైగా డౌన్‌లోడ్లు ఉన్నాయి. Google Play స్టోర్‌లో దీనికి 4.5 స్టార్ రేటింగ్‌ ఉంది.

Also Read :Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్ ఇలా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI App
  • google
  • Mathematics
  • Maths Problems
  • Photomath App

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd