Google Cloud Next : గూగుల్ మీట్ నుంచి గూగుల్ డాక్స్ దాకా.. సరికొత్త ఏఐ ఫీచర్స్
Google Cloud Next : గూగుల్ వర్క్‌స్పేస్ సూట్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు అత్యాధునిక ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
- By Pasha Published Date - 03:21 PM, Wed - 10 April 24
Google Cloud Next : గూగుల్ వర్క్‌స్పేస్ సూట్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు అత్యాధునిక ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్, మీట్, చాట్, షీట్ లాంటి ప్రొడక్టుల్లోనూ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్ట్స్-2024(Google Cloud Next) కాన్ఫరెన్సులో ఈవివరాలను గూగుల్ వెల్లడించింది. తాము తీసుకొచ్చిన ఏఐ ఫీచర్లు యూజర్ల పనిని మరింత ఈజీ చేస్తాయని తెలిపింది. ఇంతకీ ఆ ఏఐ ఫీచర్లు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
గూగుల్ మీట్
గూగుల్ మీట్‌ను మన దేశంలో కోట్లాది మంది వాడుతుంటారు. ఈ యాప్‌లో తీసుకొచ్చిన ఏఐ ఫీచర్ పేరు ‘Take Notes for me’. ఈ ఫీచర్ మీ కోసం నోట్స్ రాస్తుంది. గూగుల్ మీట్, గూగుల్ చాట్ రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కోసం నెలకు 10 డాలర్లు కట్టాలి.
గూగుల్ ఛాట్
గూగుల్ ఛాట్ ఇప్పుడు మనకు కొన్ని ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఎలా అంటే.. జెమిని ఏఐ సాయంతో జవాబులు చెబుతుంది. మనం ఏదైనా ప్రశ్న అడిగితే.. గూగుల్ ఛాట్‌లో ఉంటే జెమిని ఏఐ స్పందించి బదులిస్తుంది.అంతేకాదండోయ్.. 69 భాషల్లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను ఇది అనువాదం చేయగలదు. 4,600 యూజర్ పెయిర్స్‌ను ఇది సపోర్ట్ చేయగలదు.
గూగుల్ డాక్స్
గూగుల్ డాక్స్ కూడా చాలామంది నిత్యం వాడుతుంటారు. ఫొటోలను కూడా మనకు కావాల్సిన సైజులో గూగుల్ డాక్స్‌లో సేవ్ చేసుకునేలా త్వరలో గూగుల్ డ్రైవ్‌ను అప్డేట్ చేయనున్నారు. ఇందులో ఒక కొత్త ట్యాబ్‌ను గూగుల్ డాక్స్‌లో అందుబాటులోకి తెస్తారు. మనకు కావాల్సిన సమాచారమంతా ఒక డాక్యుమెంట్‌లోనే ఉంచుకునే గొప్ప వెసులుబాటు గూగుల్ డాక్స్.
Also Read : Lal Bihari Vs Modi : ప్రధాని మోడీపై పోటీలో లాల్ బిహారీ.. ఎవరో తెలుసా ?
గూగుల్ షీట్స్
గూగుల్ షీట్ కూడా అత్యధికంగా వినియోగంలో ఉండే మరో గొప్ప యాప్. మనకు కావాల్సిన ఫార్మాట్లో డేటాను సులభంగా మార్చుకోవడానికి ఈ యాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. దానిపేరే న్యూ టేబుల్ ఫీచర్. మన డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి వివిధ రకాల టెంప్లేట్స్ సైతం అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది.
ఏఐ మీటింగ్ యాడాన్
గూగుల్ డ్రైవ్‌లో మనం చాలా సమాచారాన్ని, ఫైళ్లను సేవ్ చేస్తుంటాం. అందులో సెన్సిటివ్ సమాచారం, ఫైల్స్ కూడా ఉంటాయి. ఏఐ మీటింగ్ యాడాన్ ఫీచరుతో అలాంటి డేటాకు రక్షణ కల్పించవచ్చు.
హెల్ప్ మీ రైట్
చాలామంది నిత్యం జీమెయిల్స్ వాడుతుంటారు. జీమెయిల్స్‌లో ఏదైనా విషయాన్ని టైప్ చేసే విషయంలో మనకు ఉపయోగపడే ఫీచరే ‘హెల్ప్ మీ రైట్’. జర్నీలో ఉన్న టైంలో మనం తడబడకుండా విషయాన్ని జీమెయిల్ లో టైప్ చేయడానికి ఈ ఫీచర్ దోహదం చేస్తుంది. సింపుల్‌గా ఒక్క క్లిక్ చేసి.. మీరు ఏదైనా నోటితో చెబితే ఆ మ్యాటర్ అంతా టెక్ట్స్ రూపంలో టైపై పోతుంది.
Also Read :Watermelon: మీరు పుచ్చకాయ కొంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
Related News
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.