Google Free Courses : గూగుల్ ఉచిత ఏఐ కోర్సులతో ఉద్యోగానికి బాటలు
Google Free Courses : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ యుగమిది.. దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
- By Pasha Published Date - 04:23 PM, Sun - 3 March 24
Google Free Courses : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ యుగమిది.. దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ఆయా కోర్సులకు ఇప్పుడు భారీ డిమాండ్ నెలకొంది. వాటిలో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే భారీ ఫీజులు చెల్లించి ఏఐ కోర్సులు నేర్చుకునే స్థోమత చాలామందికి ఉండదు. అలాంటివారికి గూగుల్ ఒక గుడ్ న్యూస్ వినిపించింది. పూర్తి ఉచితంగా కొన్ని రకాల ఆన్లైన్ ఏఐ కోర్సులు తీసుకొచ్చింది. విద్యార్థులతో పాటు ప్రొఫెషన ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. దీనివల్ల స్కిల్స్ అప్‌గ్రేడ్ అవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గూగుల్ అందిస్తున్న ఫ్రీ ఏఐ కోర్సుల(Google Free Courses) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
Introduction To Large Language Models
ఇంట్రడక్షన్ టు లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ కోర్సులో దాని పేరుకు తగిన విధంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి ఉంటుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగం ఏమిటి? వాటిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు.
Introduction To Responsible AI
ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ కోర్సులో రెస్పాన్సిబుల్ ఏఐ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తుందనే వివరాలను ఇందులో తెలుపుతారు.
Generative AI Fundamentals
జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐ టెక్నాలజీలను సులువుగా మనం నేర్చుకోవచ్చు.
Introduction To Image Generation
ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్ గురించి మనకు నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ట్రైనింగ్, డిప్లాయిమెంట్ గురించి తెలియజేస్తారు.
Also Read :Star Cricketers : భార్యలతో మెగా క్రికెటర్ల ఫొటోలు.. అట్టహాసంగా అనంత్ ప్రీ వెడ్డింగ్
Encoder – Decoder Architecture
ఎన్ కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ కోర్సులో ‘మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్’ గురించి మనకు నేర్పిస్తారు. దీనిని ఉపయోగించి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లు ఎలా పూర్తి చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన పూర్తి సమాచారానికి సారాంశం చెప్పడం, ఒక భాషలోని టెక్ట్స్‌ను మరోభాషలోకి అనువాదం చేయడం లాంటి టాస్క్‌లను ఎలా పూర్తి చేయాలో ఇందులో మనకు నేర్పుతారు.
Attention Mechanism
అటెన్షన్ మెకానిజం కోర్సులో భాగంగా ఇన్పుట్ సీక్వెన్స్‌లోని నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసేందుకు న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలి? అనే టెక్నిక్లను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు.
Create
క్రియేట్ కోర్సులో ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్ గురించి, ఎన్కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి మనకు నేర్పిస్తారు.
Introduction To Generative AI Studio
ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ స్టూడియో కోర్సులో జనరేటివ్ ఏఐ స్టూడియో గురించిన ప్రాథమిక అంశాలను మనకు తెలియజేస్తారు. దీనిని ఉపయోగించి మనం యాప్‌ల కోసం కస్టమైజ్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే ప్రోటోటైప్ మోడల్స్‌ను కూడా తయారు చేయొచ్చు.
Also Read :Pak New PM : ప్రధానిగా ఆయన్ను ఎన్నుకున్న పాక్ పార్లమెంట్.. రేపే ప్రమాణం
Related News
Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.