Gmail: మీ జీమెయిల్ ని ఎవరైనా ఉపయోగిస్తున్నారని అనుమానంగా ఉందా.. అయితే వెంటనే ఇలా చేయండి?
మీ జీమెయిల్ ను ఎవరైనా ఉపయోగిస్తున్నారని అనుమానం ఉంటే వెంటనే కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సిందే అంటున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 2 September 24

మామూలుగా స్మార్ట్ ఫోన్ వినియోగించి ప్రతి ఒక్కరికి జీమెయిల్ తప్పనిసరిగా ఉంటుంది. జిమెయిల్ లేకుండా చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఎటువంటి యాప్స్ ని వినియోగించాలి అన్న తప్పనిసరిగా మన మొబైల్ ఫోన్లో జిమెయిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జిమెయిల్ ఖాతా దాదాపు అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలు లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన వాటికి జోడించి ఉంటుంది. అయితే అలాంటి జిమెయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. లేదంటే మీ జిమెయిల్ మరొకరు ఉపయోగించి దానిని మిస్ యూస్ చేయవచ్చు. అయితే ఒకవేళ మీ జీమెయిల్ ఐడి ని ఇతరులు ఉపయోగిస్తున్నారా లేదా అన్న విషయాలను ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జీమెయిల్ ఖాతా భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే
మీ మెయిల్ అకౌంట్‌ను మరెవరైనా ఉపయోగిస్తున్నారో లేదో మీరు తెలుసుకోవాలి. గూగుల్ తన వినియోగదారులకు అలాంటి సదుపాయాన్ని అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఖాతాను మరెవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. మీ మెయిల్ ఐడీ ఎవరి వద్ద ఉంది? దానిని ఎవరు నియంత్రిస్తున్నారో మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీరు మీ మెయిల్ ను ఓపెన్ చేసి తర్వాత ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు గూగుల్ అకౌంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వీటన్నింటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే, మీ డివైజ్‌ల ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే, అన్ని డివైజ్‌లను నిర్వహించు అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంతో మీ మెయిల్ ఖాతా ఎక్కడ లాగిన్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ, మీరు మీది కాని ఏదైనా డివైజ్‌ను చూసినట్లయితే లేదా మీ అనుమతి లేకుండా మీ ఖాతా ఆ డివైజ్‌లోకి లాగిన్ అయి ఉంటే అటువంటి పరిస్థితిలో వెంటనే దాన్ని తొలగించడం మంచిది. ఇది మీ జిమెయిల్ ఖాతాను సురక్షితంగా ఉంచుతుంది. మీ జీమెయిల్ ఖాతా కోసం ఎల్లప్పుడూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సృష్టించడం మరింత మంచిది. అందుకే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు చిన్న అక్షరాలతో పాటుగా పెద్ద అక్షరాలను కూడా చేర్చడం మంచిదని చెబుతున్నారు. దీంతో మీ ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు బ్రేక్ చేయడం కష్టతరం అవుతుంది.