Video Game – X : ట్విట్టర్ లో వీడియో గేమ్ స్ట్రీమింగ్ ఫీచర్
Video Game - X : ట్విట్టర్ (ఎక్స్) డెవలప్మెంట్ పై, దానికి కొత్త కొత్త ఫీచర్స్ ను జోడించడంపై ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు.
- Author : Pasha
Date : 04-10-2023 - 12:13 IST
Published By : Hashtagu Telugu Desk
Video Game – X : ట్విట్టర్ (ఎక్స్) డెవలప్మెంట్ పై, దానికి కొత్త కొత్త ఫీచర్స్ ను జోడించడంపై ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే వీడియో గేమ్‌లను ట్విట్టర్ లో స్ట్రీమింగ్ చేసే వెసులుబాటును కల్పించే సరికొత్త ఫీచర్ ను కూడా టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌ను మస్క్ స్వయంగా కంప్యూటర్ ముందు కూర్చొని రెండుసార్లు పరీక్షించారట. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లోని తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ట్విట్టర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను ఇటీవల ఎక్స్‌లో వీడియో గేమ్ స్ట్రీమింగ్ ఫీచర్ ను పరీక్షించాను. అది బాగా పనిచేస్తోంది’’ అని ఒక ట్వీట్ లో ఎలాన్ మస్క్ రాశారు. దీన్ని చూసిన నెటిజన్లు.. ట్విచ్, యూట్యూబ్‌కు ట్విట్టర్ గట్టి పోటీ ఇస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ట్విచ్ అనేది అమెజాన్‌కు చెందిన వీడియో గేమ్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్. యూట్యూబ్‌లోనూ వీడియో గేమ్‌లను స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ట్విట్టర్ లో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్ లేకుండానే ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్ లను చేయొచ్చన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఈ ఫీచర్ ను వాడుకోవచ్చని ఆయన చెప్పారు. దీంతోపాటు పిక్-ఇన్-పిక్ మోడ్ ఫీచర్ ను కూడా తీసుకొస్తామని మస్క్ (Video Game – X) అనౌన్స్ చేశారు.