Ducati: డుకాటి కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్.. ధర లక్షల్లో అదిరిపోయే ఫీచర్స్?
ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటి ఇప్పటికే పలు రకాల మోడల్ బైక్ లను మార్కెట్ లోకి
- By Anshu Published Date - 06:15 PM, Wed - 19 October 22

ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటి ఇప్పటికే పలు రకాల మోడల్ బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. యూత్ కూడా ఎక్కువగా డుకాటి కంపెనీ తయారు చేసే స్పోర్ట్స్ బైక్ లను ఇష్టపడుతూ ఉంటారు. డుకాటి బైకులు కంట్రోల్ పవర్ ఫుల్ ఇంజన్,లేటెస్ట్ ఫీచర్లతో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా భారత మార్కెట్లోకి డుకాటి మల్టీ స్ట్రాడా వి4 పైక్స్ పీక్ బైక్ ను లాంచ్ చేసింది.
మరి ఈ లేటెస్ట్ బైక్ స్పెసిఫికేషన్ లు ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్ లో మల్టీ స్ట్రాడా వి4 పైక్స్ పీక్ బైక్ ధర రూ. 31,48,000 ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఇప్పటికే ఈ బైక్ కి సంబంధించిన బుకింగ్స్ లోని పెద్ద నగరాలు అనగా న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పూణే లోని డీలర్ షిప్ లలో బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక నవంబర్ లో ఈ బైక్స్ డెలివరీలు ప్రారంభమవుతాయి. డుకాటీ మల్టీస్ట్రాడా వి4 పైక్స్ పీక్ ప్రత్యేకమైన ఎర్గోనామిక్స్‌ను అందిస్తుంది. అలాగే హై కంట్రోల్‌ను అందించేలా, లీన్ యాంగిల్స్ ఆప్టిమైజ్ చేసేలా డిజైన్ చేశారు. బైక్ రైడింగ్ పొజిషన్ పూర్తి కొత్తగా వస్తుంది.
మినిమం లీన్ యాంగిల్ అందించడానికి ఫుట్ పెగ్‌లను కొంచెం వెనుకకు మార్చారు. ఈ బైక్‌లో ఎలక్ట్రానిక్ ఓహ్లిన్స్ సస్పెన్షన్ ఉంది, రైడర్ రైడింగ్ స్టైల్ ఆధారంగా అడ్జస్ట్ అవుతుంది. సీటు ఎత్తు 810-860mm మధ్య అడ్జస్ట్ అవుతుంది. హ్యాండిల్‌బార్ లోయర్‌లో, కర్వ్‌డ్ బార్‌లతో వస్తుంది. ఈ వి4 బైక్ గ్రాంటురిస్మో ఇంజిన్ తో వస్తుంది. కాగా ఇది 1588 సిసి డిస్ ప్లేస్ మెంట్ కలిగిన తేలికపాటి 66.7 కిలోల ఇంజిన్ ను కలిగి ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. బైక్ ముందు వెనకా స్టాండర్డ్ రేడార్ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ ప్యాకేజీ తో వస్తుంది.