Aadhaar: ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో మీకు తెలుసా!
ప్రస్తుతం కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారి పోయింది. నేడు ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా
- By Nakshatra Published Date - 07:30 PM, Fri - 19 January 24
ప్రస్తుతం కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారి పోయింది. నేడు ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ పెరుగుతున్న అవసరం కారణంగా దానిని అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. చాలా మందికి ఆధార్‌లో కొన్ని వివరాలు తప్పుగా పడుతుంటాయి. ఇలాంటి తప్పులను మీరు సకాలంలో సరి చేసుకోవచ్చు. కార్డులో మీ పేరు తప్పుగా ఉన్నా, అడ్రస్ తప్పుగా ఉన్నా సకాలంలో సరిదిద్దుకోవాలి. అయితే ఆధార్ లో కొన్ని తప్పులను కేవలం కొన్ని సార్లు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాటిలో పుట్టిన తేదీ కూడా ఒకటి.
మరి పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదు. కేవలం ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీని మార్చాల్సి వస్తే యూఐడీఏఐ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న ఆధార్ సెంటర్ లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి. ఇక ఆధార్ కార్డులో ఫొటోను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉంది.
స్థానికంగా ఉన్న ఆధార్ ఎన్రోల్ సెంటర్‌కు వెళ్లి మీ ఫొటో, వేలి ముద్రలు వంటి వాటి ఆధారంగా ఫొటోలను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇక ఆధార్ కార్డులో అడ్రస్‌ను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అడ్రస్ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ సెంటర్లో సంబంధించిన డాక్యుమెంట్స్‌ని అందించడం ద్వారా ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో జెండర్‌ను ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించడం ద్వారా జెండర్ అప్డేట్ను మరోసారి అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవడానికి సాధారణంగా.. పాస్‌పోర్ట్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, టెన్త్ సర్టిఫికెట్, టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికేట్ వంటి సర్టిఫికెట్స్ అవసరపడతాయి.
Related News
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.