Instagram Account: ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి?
ప్రస్తుత రోజుల్లో ఇంస్టాగ్రామ్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఈ ఇంస్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. అలా రోజు
- By Nakshatra Published Date - 03:04 PM, Wed - 17 January 24
ప్రస్తుత రోజుల్లో ఇంస్టాగ్రామ్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఈ ఇంస్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. అలా రోజు రోజుకి ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఇలా ఒక వైపు ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండగా కొన్ని కొన్ని కారణాల వల్ల కొందరు ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వీడ్కోలు చెబుతున్నారు. అయితే ఇలా ఇంస్టాగ్రామ్ డీఆక్టివేట్ చేయాలి అనుకున్నప్పుడు దాని ప్రాసెస్ ఎలా అన్నది చాలా మందికి తెలియదు..
సింపుల్‌గా ఇన్స్టాగ్రామ్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా కొన్ని టిప్స్ పాటించి ఇంస్టాగ్రామ్ ఎలా డియాక్టివేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ పరికరంలో ఇన్స్టాగ్రామ్ యాప్‌ను తెరవాలి. మీ ప్రొఫైల్‌కి వెళ్లడానికి దిగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత కుడి వైపు ఎగువ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి. సెట్టింగ్‌లు, గోప్యత ఎంపికను ఎంచుకుని, అకౌంట్స్ సెంటర్ ఎంపికను తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత వివరాలను ఎంచుకోవాలి. ఖాతా యాజమాన్యం, నియంత్రణ ఎంపికను ఎంచుకొని, క్రియారహితం లేదా తొలగింపును నొక్కాలి. అనంతరం మీరు శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న లేదా తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోవాలి.
మీరు మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి అనే ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంస్టాగ్రామ్ ని కంప్యూటర్ లో ఉపయోగిస్తుంటే ఎలా డీయాక్టివేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏదైనా వెబ్ బ్రౌజర్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరవాలి. అనంతరం మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. మీ ఖాతా తెరిచిన తర్వాత దిగువ ఎడమ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి. అనంతరం సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి. ఖాతాలను ఎంచుకుని, ఆపై వ్యక్తిగత వివరాల ఎంపికను ఎంచుకోవాలి. ఖాతా యాజమాన్యం, నియంత్రణను క్లిక్ చేయాలి. అనంతరం డియాక్టివేషన్ లేదా తొలగింపును ఎంచుకోవాలి. మీరు తొలగించాలనుకుంటున్న లేదా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి. లేదా కొనసాగించు ఎంచుకుంటే ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.
Related News
Meta CEO Zuckerberg: మెటా సీఈవో జుకర్‌బర్గ్ శాలరీ ఎంతో తెలుసా..? రూ. 100 కంటే తక్కువే..!
మార్క్ జుకర్‌బర్గ్ 2023 సంవత్సరంలో కేవలం 1 డాలర్ (83 రూపాయలు) మాత్రమే ప్రాథమిక వేతనంగా తీసుకున్నాడు. మార్క్ ఈ జీతం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.