Whatsapp : వాట్సాప్ లో ఈ పొరపాటు చేస్తే..మీ అకౌంట్లో నుంచి డబ్బు మాయం..జాగ్రత్త..!!
- By hashtagu Published Date - 10:42 PM, Fri - 4 November 22
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్…దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. భారత్ లో 500మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అయితే స్కామర్లు మాత్రం వచ్చిన అవకాశం ఏదీ వదులుకోవడం లేదు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా జనాలను ట్రాప్ చేసేందుకు రెడీ అయ్యారు. స్కామర్లు వాట్సాప్ యూజర్లను ట్రాప్ చేసేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్, లాటరీ లేదా ప్రభుత్వ బిల్లుల చెల్లింపు, ఇలాంటి మెసేజ్ లతో రంగంలోకి దిగుతున్నారు కేటుగాళ్లు. అయితే అలాంటి వాటి ట్రాప్ లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
1. కోవిడ్ వచ్చాక వర్క్ ఫ్రం హోం కల్చర్ ప్రారంభమైంది. ఇప్పడు సాధారణ పరిస్థితికి రావడంతో మళ్లీ ట్రాక్ లో వచ్చాం. కానీ చాలామంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో స్కామర్లు ట్రాప్ చేసేందుకు వర్క్ ఫ్రం హోం ఆఫర్స్ ను మెసేజ్ ల రూపంలో వాట్సాప్ లోకి పంపిస్తున్నారు. ఈ స్కామర్స్ ను మెసేజ్ రూపంలో ఫిషింగ్ లింక్ పంపిస్తారు. దానిపై క్లిక్ చేసిన వెంటనే మన డేటా అంతా కూడా స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మీ వాట్సాప్ కు అలాంటి మెసేజ్ లు వస్తే వాటిని వెంటనే డిలిట్ చేయండి. ఆ నెంబర్ ను కాంటాక్ట్ నుంచి తొలగించండి. కంపెనీలు వాట్సాప్ లో ఎలాంటి ఫిషింగ్ లింక్ లు పంపించవనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
2. విద్యుల్ బిల్లుకు సంబంధించిన మోసం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కరెంట్ కోత పేరుతోనే లేదా పెండింగ్ బిల్లు పేరుతోనో మీకు మెసేజ్ వస్తుంది. మీరు కరెంట్ బిల్లు కట్టలేదని డిస్ కనెక్ట్ అవుతుందని విద్యుత్ శాఖ పేరుతో మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ నెంబర్ కు సంప్రదించండంటూ కోరుతారు. మీరు ఆ నెంబర్ కు కాల్ చేస్తే మీ అకౌంట్లోని డబ్బు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఎలాంటి నెంబర్ల నుంచి మెసేజ్ లు వచ్చినా వాటికి స్పందించకపోవడమే మంచిది. ప్రజలను ట్రాప్ చేసేందుకు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు స్కామర్లు. కాబట్టి మీ వాట్సాప్ ఎలాంటి గుర్తుతెలియని మెసేజ్ లు వచ్చినా నెంబర్లు వచ్చినా వాటిని వెంటనే డిలిట్ చేయడం మంచిది.
Tags
Related News
Tech Tips: మీరు ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?
ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది అనేక రకాలు వాటి కోసం ల్యాప్టాప్ లను వినియోగిస్తున్నారు. కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళ