Pregnancy In Space : అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా ? పుట్టే పిల్లలు ఎలా ఉంటారు ?
అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు గర్భం దాల్చడం(Pregnancy In Space) అసాధ్యమేం కాదు. సాధ్యమే.
- By Pasha Published Date - 06:29 PM, Tue - 14 January 25

Pregnancy In Space : మనిషి ఎక్కడున్నా సెక్స్ చేయక తప్పదు. అది భూమిపై అయినా.. అంతరిక్షంలో అయినా సరే!! ఇంతకూ అంతరిక్షంలో మనుషులు సెక్స్ చేయడం సాధ్యమా ? అక్కడ వ్యోమగాములు సెక్స్ చేసుకొని పిల్లలు పుడితే.. ఎలా ఉంటారు ? అనేవి ఆసక్తికర అంశాలు. వాటి గురించి తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
Also Read :Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు
- అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు గర్భం దాల్చడం(Pregnancy In Space) అసాధ్యమేం కాదు. సాధ్యమే.
- అక్కడ గర్భం దాల్చే మహిళల ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్య కేవలం పుట్టే బిడ్డకు మాత్రమే ఉంటుంది.
- అంతరిక్షంలో గర్భం దాల్చే మహిళా వ్యోమగామి కడుపులోని పిండానికి ముప్పు ఉంటుంది.
- అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దీనివల్ల అక్కడ పుట్టబోయే శిశువు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. శిశువు శరీరంలోని పెల్విక్ ఎముకలు బలహీనపడతాయి. తల్లికి ప్రసవం చేసే టైంలో శిశువు ఎముకలు విరిగే రిస్క్ ఉంటుంది.
- అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లోపించడం వల్ల పిండం ఎదుగుదల సరిగ్గా ఉండదు. దీనివల్ల పసికందును మరిన్ని ఆరోగ్య సమస్యలు ముసురుకుంటాయి.
- అంతరిక్ష రేడియేషన్ ఎఫెక్టు అనేది మహిళా వ్యోమగామిపై పడుతుంది. దీని ప్రభావంతో ఆమె కడుపులోని పిండంలో జన్యుపరమైన బలహీనతలు ఏర్పడతాయి.
- అంతరిక్ష యాత్రలో ఉండే వ్యోమగాములు సెక్స్‌లో పాల్గొనే అంశంపై ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థలకు ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన పాలసీ ఏదీ లేదు.
- ఇప్పటివరకు అంతరిక్ష యాత్రలకు వెళ్లిన వివిధ దేశాల వ్యోమగాములు ఎవరూ సెక్స్‌లో పాల్గొనలేదు.
Also Read :AP Deputy CM : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ? టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వీడియో
- గతంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఎలుకల వీర్యాన్ని ఫ్రీజ్ చేసి అంతరిక్షానికి పంపారు. దాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరేళ్ల పాటు ఉంచారు.
- ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి ఎలుకల వీర్యాన్ని తీసుకొచ్చారు. వాటి ద్వారా వందలాదిగా ఎలుక పిల్లలు పుట్టాయి. ప్రత్యేకించి 168 ఎలుక పిల్లలు హెల్తీగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.