Budget CNG Cars: పెట్రో కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లు.. ధర, ఫీచర్స్ ఇవే?
నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల కార్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా పెట్రోల్, డిజిల్ లాంటి
- By Anshu Published Date - 07:00 AM, Tue - 21 February 23

నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల కార్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా పెట్రోల్, డిజిల్ లాంటి ఇంధనాలతో నడిచే కార్లు కూడా విడుదల అవుతూనే ఉన్నాయి. వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా వేరే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈవీ కార్ల ట్రెండ్ నడుస్తున్నా చార్జింగ్ స్టేషన్ల కొరత, మానవ వనరుల లోపం కారణంగా ఈవీ వైపు అంతగా దృష్టి పెట్టడం లేదు.
దీంతో ఈ సమయంలో వారికి సీఎన్‌జీ కార్లు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. మరి పెట్రో కార్లకు బదులుగా రూ. 10 లక్షల లోపు ఉండే సీఎన్‌జీ కార్ లగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మారుతీ సుజుకీ సిఫ్ట్.. ఈ కార్ ధర రూ.7.8 లక్షలకు గా ఉంది. సీఎన్‌జీ ఆధారిత మార్కెట్‌ను చాలా ఎక్కువగా ఈ కార్ సొంతం చేసుకుంది. కాగా ఈ కార్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్, నాలుగు సిలిండర్, డ్యుయల్ జెట్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే 89 పీఎస్ వద్ద 119 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కిలో సీఎన్‌జీకు 39 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాటా టియాగో ఐసీఎన్‌జీ..ఈ కార్ నాలుగు వేరియంట్లల్లో లభించునుంది. 1.2 లీటర్, మూడు సిలిండర్ రెట్రోవాన్ ఇంజిన్‌తో రానుంది.
86 పీఎస్ వద్ద 113 టార్క్ పవర్‌ను ఈ కార్ విడుదల చేస్తుంది. ఐదు మాన్యువల్ గేర్ బాక్స్‌లతో వచ్చే ఈ కార్ ధర వేరింయట్‌ను బట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.7.32 లక్షల మధ్య ఉంటుంది.ఈ కార్ 26.49 కి. మీ మైలేజ్‌ను ఇస్తుంది.. హ్యూందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్.. సీఎన్‌జీ వెర్షన్లలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ కార్ చాలామంది వినియోగదారుల మనసును దోచుకుంటుంది.1.2 లీటర్, నాలుగు సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కార్ 83 పీఎస్ వద్ద 113 టార్క్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ వేరియంట్‌ను బట్టి రూ.7.70 లక్షల నుంచి రూ.8.45 లక్షల మధ్య ఉంటుంది. హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీ.. భారత్‌లో బాగా క్రేజ్ ని సంపాదించుకున్న కాంపాక్ట్ సీఎన్‌జీ సెండాన్ కార్ హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీ. గ్రాండ్ ఐ 10 నియోస్‌లో ఉన్న ఇంజిన్‌తోనే ఈ కార్‌లో కూడా ఉంటుంది. హ్యూందాయ్ ఆరా రెండు వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. ఎస్ వేరియంట్ ధర రూ.6.09 లక్షలుగా ఉంటే, ఎస్ఎక్స్ ధర రూ.8.57 లక్షలుగా ఉంటుంది.