Smartwatches Under 3k: మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ లు.. ధర, ఫీచర్స్ ఇవే?
రోజురోజుకీ స్మార్ట్ వాచ్ ల వినియోగం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా
- By Nakshatra Published Date - 06:30 AM, Tue - 4 April 23
రోజురోజుకీ స్మార్ట్ వాచ్ ల వినియోగం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్ లను తీసుకువస్తూనే ఉన్నాయి. అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ లను తీసుకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే స్మార్ట్ వాచ్ ప్రియులకు ఒక చక్కటి శుభవార్త.. అదేమిటంటే కేవలం 3 వేల లోపు బడ్జెట్ ధరలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరోజురోజుకీ స్మార్ట్ వాచ్ ల వినియోగం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడారాల్లోకి వెళితే.. బోట్ స్టార్మ్ వాచ్..ఈ వాచ్ స్టైలిష్ లుక్ లో ఉండి,240 x 240 పిక్సెల్ ల రిజల్యూషన్‌తో వృత్తాకార 1.3 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. గా ఉంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ లాంటి మంచి మంచి ఫీచర్లు ఉన్నాయి. తొమ్మిది రకాల స్పోర్ట్స్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. దీని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తూనే ఉంటుంది. అలాగే మరో స్మార్ట్ వాచ్.. నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా.. ఈ వాచ్ ధార రూ. 1,999 గా ఉంది. ఇది 1.75 అంగుళాల హెచ్ డీ డిస్ప్లేను కలిగి ఉంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కూడా వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. అలాగే 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే తొమ్మిది రోజుల పాటు పనిచేస్తుంది.
అమాజ్‌ఫిట్ నియో స్మార్ట్ వాచ్.. దీని ధర రూ. 2,499 గా ఉంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ వాచ్ గా పని చేస్తుంది. ఇందులో 1.2 అంగుళాలతో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్ప్లేను ఉంటుంది. ఇది మీకు సమయం, తేదీ, దశల సంఖ్య, బర్న్ అయిన కేలరీలను చూపుతుంది. మీ హృదయ స్పందన రేటు, నిద్ర నాణ్యతను పర్యవేక్షించడానికి వాచ్‌లో పీపీజీ బయో-ట్రాకింగ్ సెన్సార్‌ను అమర్చారు. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 28 రోజుల పాటు పనిచేస్తుంది. ఫైర్ బోల్ట్ SpO2 స్మార్ట్ వాచ్.. ఈ వాచ్ ధర రూ. 2,499 గా ఉంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లతో పని చేస్తుంది. ఇందులో 1.4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. దీనిలోని బ్యాటరీ 10 రోజుల పాటు వస్తుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.