Mymanu Titan: స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఇయర్ బడ్స్ ఉపయోగించండిలా?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్, ఎయిర్ ప్యాడ్,
- Author : Anshu
Date : 09-03-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ఇవి కూడా ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మొట్టమొదటి 4జీ కనెక్ట్ చేయబడిన వైర్లెస్ ఇయర్ ఫోన్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ ఇయర్ బడ్స్ పేరే మైమను టైటాన్. ఇవి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు. ఈ పరికరం నేరుగా 37 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించగలదు.
దీనితో పాటు వాయిస్ కంట్రోల్ కూడా అందించబడింది. న్యూస్‌రూమ్ పోస్ట్ ఈ ఇయర్‌ఫోన్‌లు భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్‌లను భర్తీ చేస్తాయని తెలిపింది. ఈ ఇయర్‌ఫోన్ ల వల్ల స్మార్ట్‌ఫోన్ సహాయం లేకుండానే కాల్‌లను స్వీకరించడం,ఎస్ఎమ్ఎస్ లు పంపడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మైమను టైటాన్ సెల్యులార్ డేటా ద్వారా ఇంటర్నెట్‌ను కూడా అమలు చేయగలదు. అనువాదం కోసం దీన్ని MyJuno యాప్‌కి కనెక్ట్ చేయాలి. వాయిస్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లు వాయిస్ యాక్టివేటెడ్ టెక్నాలజీ ద్వారా కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్‌ని సాధించగలవు.
పాటలు కూడా వినవచ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లలో ANC వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి. దీన్ని ప్రారంభంలో యూరప్ అలాగే అమెరికాల్లో లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత మరిన్ని దేశాలకు విస్తరించనున్నారు. దీని ధర $400 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా ధర రూ. 32,697 గా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగదారులు ఈ ఇయర్‌ఫోన్ ల ధర,ఫీచర్స్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు..