New iPhones: కొత్త కలర్స్ లో ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాలు ఐఫోన్ ఫోన్ లను విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 07:30 AM, Fri - 10 March 23

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాలు ఐఫోన్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనేగత ఏడాది యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసింది. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయిన ఐఫోన్ 14 మోడల్స్ కి మంచి క్రేజ్ దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం యాపిల్ సంస్థ ఇండియాలో కొత్త కలర్ ఆప్షన్స్ లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. యాపిల్ ఇప్పుడు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ ని పసుపు రంగులో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా పసుపు కలర్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ ప్రీ ఆర్డర్స్ మార్చి 10 నుంచి అందుబాటులో ఉంటాయని, మార్చి 14 నుంచి వీటి సేల్స్ ప్రారంభమవుతాయని యాపిల్ వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లు ఇప్పటికే మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, ఎరుపు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఈ లైనప్‌లో లాంచ్ అయిన యెల్లో కలర్ ఫోన్లు 128జీబీ,256జీబీ,512జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. ఈ కొత్త కలర్ ఆప్షన్ ఐఫోన్ 14 మోడల్స్ ధరలు రూ.79,900 నుంచి ప్రారంభం కానుండగా ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్స్ ధరలు రూ.89,900 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ రెండు మోడళ్లలో డ్యుయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఈ లెన్స్ హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలవు. ఐఫోన్ 14 పొడవు 6.1 అంగుళాలు కాగా, ఐఫోన్ 14 ప్లస్ 6.7 అంగుళాలు ఉంటుంది. క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ ఎమర్జెన్సీ SOS వంటి ఎన్నో సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Related News

iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?
సాధారణంగా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే చాలు ఆయా కంపెనీలు వారి వస్తువులపై ఎన్నో రకాల ఆఫర్లను