iPhone Screen Distance: స్మార్ట్‌ఫోన్ నుంచి మయోపియా ప్రమాదం.. ఐఫోన్ సరికొత్త టెక్నాలజీ
అస్తమానం మొబైల్ ఫోన్ ఉపయోగించడం ద్వారా కళ్ళు దెబ్బతింటాయని ఎంతో మంది నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది.
- By Praveen Aluthuru Published Date - 11:07 AM, Sun - 24 September 23

iPhone Screen Distance: అస్తమానం మొబైల్ ఫోన్ ఉపయోగించడం ద్వారా కళ్ళు దెబ్బతింటాయని ఎంతో మంది నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది. కానీ అతిగా ఫోన్ చూడటం ద్వారా డివైజ్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి వల్ల కళ్లకు హాని కలుగుతుంది. అయితే ఫోన్‌ని ఎంత దూరం నుంచి చూస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎలా ఉపయోగిస్తే సురక్షితమో మీకు తెలుసా? ఫోన్‌ను ముఖానికి 12 అంగుళాలు లేదా 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం మంచిది. ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ తమ వినియోగదారుల కోసం అత్యాధునిక టెక్నలాజిని పరిచయం చేస్తుంది. తద్వారా మొబైల్ నుంచి వచ్చే కాంతి నుంచి కళ్ళను కాపాడుతుంది.
వినియోగదారు ఫోన్‌ను దగ్గరగా పెట్టుకుని ఆపరేట్ చేస్తే అది కంటి చూపును ప్రభావితం చేస్తుంది. 12-అంగుళాల దూరంలో ఉంచి చూడటం ద్వారా మయోపియా ప్రమాదం నుంచి కాపాడుకోగలుగుతారు. మయోపియా ప్రభావానికి గురైతే దూర దృష్టి ప్రభావితమవుతుంది. వ్యక్తి సమీపంలోని వస్తువులను చూడగలడు. కానీ సుదూర వస్తువులను చూసినప్పుడు అది అస్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు కూడా మయోపియా బారీన పడే సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఐఫోన్ తయారీదారు సంస్థ iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో స్క్రీన్ దూరం సౌకర్యాన్ని అందిస్తోంది. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ఫోన్ కళ్ళకు దగ్గరకు పెట్టి చూస్తారో ఫోన్ స్క్రీన్‌పై నోటిఫికేషన్ వస్తుంది. దాంతో అలర్ట్ అవుతారు.
Also Read: Farmer Ganesha : జయములివ్వు ‘రైతు గణేశా’.. ఫొటోలు వైరల్