Adani : ఆటోమొబైల్ రంగంలోకి అదానీ ఎంట్రీ…?
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ...అత్యంత సంపన్నుల్లో సంపన్నుడు.
- By Hashtag U Published Date - 01:00 PM, Sun - 23 January 22

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ…అత్యంత సంపన్నుల్లో సంపన్నుడు. సంపద సృష్టిలో మరిన్ని శిఖరాలు అధిరోహించేందుకు అదానీ కొత్త వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మొన్న ఉక్కు పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆటో మొబైల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. భూమిపై, నీటిలో నడిచే వాహనాలకు ఉపయోగించే అదానీ అనే ట్రేడ్ మార్క్ ను లెటెస్ట్ గా ఎస్ బీ అదానీ ట్రస్సు పొందడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూప్ కు చెందిన ఎస్ బీ అదానీ ట్రస్ట్ ఈ ట్రేడ్ మార్క్ను ప్రతిపాదించింది. దీనికి అప్రూవల్ రావడంతో ఆటో మొబైల్ రంగంలో అదానీ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక గ్రీన్ ప్రాజెక్టులలో భాగంగా పోర్ట్స్-టు-పవర్ ఇలా అన్ని బిజినెస్సుల్లోనూ రాణించాలన్న ఉద్దేశ్యంతో ఆటో మొబైల్స్ లోకూడా అదానీ ప్రవేశిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలైన కోచ్ లు, బస్సులు, ట్రక్కుల వంటి ఎలక్ట్రిక్ మొబిలిటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేస్ లోకి ప్రవేశించాలనేది అదానీ ప్లాన్ అని అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రారంభంలో దాని అంతర్గత అవసరాలు, విమానాశ్రయాలు, పోర్టులు ఇతర లాజిస్టిక్స్ ప్రయోజనాల కోసం తన ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. ఇక అదానీ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను రెడీ చేయడంతోపాటుగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అటు ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్లోకి అదానీ ప్రవేశించినట్లయితే మార్కెట్ షేక్ అవుతుందని ఆటో మొబైల్ పరిశీలకు చెబుతున్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, దోస్త్ బ్రాండ్ లతో లాస్ట్ మైల్, ఫస్ట్ మైల్ కనెక్టివిటి సెగ్మెంట్ ను నియంత్రిస్తున్నాయి. ప్రస్తుతం లైట్ మీడియం, కార్గో క్యారియర్లు వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారుతున్నాయి. కారణం ఏంటంటే E-LCV ప్రతి కిలోమీటరకు నిర్వాహణ ఖర్చు 80 పైసలు మాత్రమే. అదే డీజిల్ వాహనమైతే ప్రతి కిలోమీటర్ కు నిర్వాహణ ఖర్చు 4రూపాయలు అవుతోంది. దీనికి తోడుగా ప్రభుత్వ ఫేమ్ 2 సబ్సిడీలు కూడా మూలధన ధరను తగ్గించేశాయి.
ఇతర బిగ్ బ్యాంగ్ సెగ్మెంట్ బస్సులు, ప్రత్యేకంగా కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ బెంగుళూరు, సూరత్, హైదరాబాద్, కోల్ కతా , ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు 5,450 సింగిల్ డెక్కర్, 130 డబుల్ డెక్కర్ ఈ బస్సుల కోసం టెండర్ ను రన్ చేస్తోంది. బ్యాటరీ ధరలు 12, 18 నెలల్లో వంద డాలర్ల కంటే తక్కువగా పడిపోతాయని అంచనా వేయడంతో ఈవీ మార్కెట్లో పోటీతత్వం నెలకొంటోంది.