Tech Lookback 2024 : 2024లో ‘ఏఐ’ నుంచి ‘ఈవీ’ దాకా ఎన్నెన్నో ‘టెక్’ మెరుపులు
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు 2024లో సూపర్ రేంజులో క్రేజ్(Tech Lookback 2024) పెరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి.
- By Pasha Published Date - 07:09 PM, Sat - 14 December 24

Tech Lookback 2024 : 2024 సంవత్సరం అధునాతన టెక్నాలజీని ఈ ప్రపంచానికి అందించింది. ఆటోమొబైల్ రంగం నుంచి మొదలుకొని సాఫ్ట్‌వేర్ రంగం దాకా ప్రతీచోటా టెక్ ఆవిష్కరణలు సందడి చేశాయి. వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగం దాకా ఎన్నో సాంకేతిక సదుపాయాలు ప్రజలకు కంఫర్ట్‌ను ప్రసాదించాయి. వీటన్నింటికి మించి స్మార్ట్‌ఫోన్లలో అద్భుత అప్‌డేట్లు ఈతరాన్ని ఆకట్టుకున్నాయి. ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు యువతను ఆకట్టుకున్నాయి. దీంతో వాటి సేల్స్ సూపర్ బంపర్ రేంజులో జరిగాయి. 2024 సంవత్సరం త్వరలో అల్ విదా చెప్పబోతున్న వేళ వీటిపై ఓ పరిశీలన..
Also Read :Rajamouli First Love : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన ఎస్.ఎస్.రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్
ప్రతిచోటా ‘ఏఐ’
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ 2024లో సత్తా చాటుకుంది. ఎన్నో రంగాలను అనూహ్య రీతిలో ప్రభావితం చేసింది. ఏఐ ఛాట్‌బాట్‌లు చాలా రంగాల్లో పెను విప్లవాన్ని క్రియేట్ చేశాయి. ఆయా రంగాల కస్టమర్లకు చేదోడుగా నిలిచే ఫ్రెండ్స్‌గా మారాయి. గూగుల్, యాపిల్, ఓపెన్ ఏఐ, మెటా(వాట్సాప్, ఫేస్‌బుక్), ట్విట్టర్ (ఎక్స్) వంటి కంపెనీలు ఏఐ టెక్నాలజీతో తమదైన ముద్ర వేశాయి. సరికొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత చేరువయ్యాయి. హెల్త్‌కేర్ డయాగ్నస్టిక్స్ విభాగంలోకి కూడా ఏఐ టూల్స్ ప్రవేశించాయి. ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ హోమ్ హబ్‌ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. చివరకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సమాచారాన్ని వడపోసేందుకు ఏఐ టెక్నాలజీని వాడుకుంటుండటం గమనార్హం.
ఈవీ జోరు
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు 2024లో సూపర్ రేంజులో క్రేజ్(Tech Lookback 2024) పెరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. వాటిపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఓలా, టీవీఎస్, బజాజ్ లాంటి కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో హోరాహోరీగా తలపడ్డాయి. సరికొత్త వాహన మోడళ్లను ప్రజలకు అందించాయి. ఎలక్ట్రిక్ ఆటోలతో బజాజ్ సంచలనం క్రియేట్ చేసింది. ఈవీ స్కూటర్ల విభాగంలో ఓలా, టీవీఎస్ అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈవీల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో రేట్లు కూడా చాలా వరకు తగ్గాయి. ఫలితంగా సేల్స్ పెరుగుతున్నాయి.
Also Read :Agriculture Loans : రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్
ఫోల్డబుల్ డివైజ్‌లు కళకళ
2024 సంవత్సరంలో ఫోల్డబుల్ డివైజ్‌లు సందడి చేశాయి. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు టెక్ ప్రియులను ఆకట్టుకున్నాయి. మన్నికతో పాటు స్టైలిష్‌గా ఉండటంతో వీటిని కొనేందుకు జనం పోటీపడ్డారు. ఫోల్డబుల్ ప్రోడక్ట్స్ తయారీలో శాంసంగ్ కంపెనీ అగ్రగామిగా నిలిచింది. యాపిల్, సోనీ, ఎల్‌జీ లాంటి కంపెనీలు తర్వాతి వరుసలో నిలిచాయి.
స్మార్ట్ ఫోన్ల సందడి
ఈ సంవత్సరం కొన్ని స్మార్ట్ ఫోన్లు మనదేశంలో భారీగా సేల్ అయ్యాయి. ఈ జాబితాలో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 16 సిరీస్ (iPhone 16 Series) ఫోన్ ఉంది. దీని ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ (Google Pixel 9 Series) ఫోన్ బాగా సేల్ అయింది. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ (Samsung Galaxy S24 Series) ఫోన్ విక్రయాలు బాగానే జరిగాయి. దీని ధర రూ.62,999 నుంచి ప్రారంభం అవుతుంది. రెడ్‌మీ నోట్ 14 సిరీస్ (Redmi Note 14 Series) ఫోన్‌కు మంచి క్రేజ్ లభించింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభం అవుతుంది. వివో వీ40 సిరీస్ (Vivo V40 Series) ఫోన్‌కు మంచి స్పందన వచ్చింది. దీని ధర రూ.34,999 నుంచి షురూ అవుతుంది.